సినిమా చూసొచ్చి రెచ్చిపోయారు: స్టార్ హీరో ఫ్యాన్స్ తీరుపై విమర్శలు!

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' విడుదల తర్వాత తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రేవేశ పెట్టిన పథకాలను విమర్శిస్తూ సీన్లు ఉండటంపై ఇప్పటికే రాజకీయ సెగ రగిలింది.

సినిమాలోని ఓ సీన్లో ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత మిక్సర్ గ్రైడర్లు, ఇతర సామాగ్రి మంటల్లో వేస్తూ కనిపించారు. ఈ సీన్లో స్వయంగా దర్శకుడు మురుగదాస్ ఓ పాత్ర పోషించడం గమనార్హం. ఇది అధికార అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. పేదల కోసం జయలలిత ప్రవేశ పెట్టిన పథకాలను కించ పరిచే విధంగా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన చేపట్టారు.

విజయ్ అభిమాని వీడియో వైరల్

ఓ వైపు సినిమాలోని సీన్లపై గొడవ నడుస్తుంటే.... సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్ వీడియో ఒకటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ వీడియోలోని వ్యక్తి ల్యాప్ ట్యాప్ ధ్వంసం చేస్తూ కనిపించారు. అది జయలలిత ప్రభుత్వం పేదల కోసం పంచిన ఫ్రీ లాప్‌టాప్ అనే ప్రచారం జరుగుతోంది.

ఇది ‘సర్కార్' సినిమా ఎఫెక్టే?

ఇది ‘సర్కార్' సినిమా ఎఫెక్టే?

విజయ్ అభిమానిగా చెప్పబడుతున్న వ్యక్తి ల్యాప్ టాప్ ధ్వంసం చేయడానికి కారణం ‘సర్కార్' సినిమాలో చూపించిన కొన్ని సీన్ల ప్రభావమే అని, ఆ సినిమా చూసి వచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే వాద వినిపిస్తోంది.

 ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దు

ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దు

విజయ్ ఫ్యాన్ ల్యాప్ టాప్ ధ్వంసం చేస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పనులను అస్సలు ఎంకరేజ్ చేయవద్దు. ఎంతో మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇవి అవసరం. మీకు అవసరం లేకుంటే నాశనం చేసే బదులు పేద వారికి ఇవ్వొచ్చు కదా.. అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చెంపలేసుకుని అభిమానులకు బ్రెయిన్ వాష్ చేయండి

చెంపలేసుకుని అభిమానులకు బ్రెయిన్ వాష్ చేయండి

ఇలాంటి సినిమా తీసినందుకు.... ముందు మీరు లెంపలేసుకుని మీ అభిమానులకు బ్రెయిన్ వాష్ చేయండి అంటూ కొందరు నెటిజన్లు విజయ్, మురుగదాస్‌ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

సర్కార్

సర్కార్

తమిళనాడు రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ... ఏఆర్ మురుగదాస్ ‘సర్కార్' చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా... వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X