సర్కార్‌కు ఎదురుదెబ్బ.. మురుగదాస్‌పై కేసు..
Recommended Video

సర్కార్ చిత్రం ఓ వైపు కలెక్షన్ల మోత మోగిస్తుంటే.. మరో పక్క కేసులు, వివాదాలు వెంటాడుతున్నాయి. గతంలో కథను కాపీ కొట్టాడనే ఆరోపణలను ఎదుర్కొన్న దర్శకుడు మురగదాస్ మరో కేసులో ఇరుక్కున్నాడు. తమిళనాడులో అధికారపార్టీ ఏఐఎండీఎంకే ప్రతిష్టను దిగజార్చేలా ఉందంటూ సర్కార్ సినిమాపై, దర్శకుడు మురుగదాస్‌పై ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. రెండు రోజుల క్రితం తమిళనాడు మంత్రి కదంబు రాజు చిత్రంలోని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా
సర్కార్ సినిమా కంటెంట్‌పై రాజకీయ నేతలు భగ్గుమంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం విధానాలను, ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సర్కార్ కథ, కథనాలు ఉన్నాయని దేవరాజన్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు.

దర్శకుడిపై చర్య తీసుకోవాలి
సర్కార్ కథ ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉంది. అవాస్తవాలకు దూరంగా ఉంది. అందుచేత ఈ సినిమాలోని సన్నివేశాలను తొలగించాలి, దర్శకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెన్నై నగర కమిషనర్‌కు దేవరాజన్ ఫిర్యాదు అందజేశారు.

పెదవి విప్పని యూనిట్
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సరిపడే విధంగా సర్కార్ సినిమాలో రాజకీయ సందేశాలను జొప్పించారు. ప్రభుత్వాల పనితీరుపై నిరసన గళం వినిపించారు. దాంతో విజయ్ సినిమాపై రాజకీయ వర్గాలు కన్నెర్ర జేస్తున్నారు. తాజా కేసుపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆసక్తిని రేపుతున్నది.

రూ.100 కోట్ల కలెక్షన్లు
నవంబర్ 6న రిలీజైన సర్కార్ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను చవిచూసింది. అయినా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో విజయ్ తోపాటు కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్; రాధారవి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











