‘సర్కార్’ ట్విట్టర్ రివ్యూస్: ఫస్టాఫ్ కేక... కానీ సెకండాఫ్!
విజయ్ హీరోగా ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'సర్కార్' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తమిళనాడు కంటే ముందుగానే ఓవర్సీస్‌లో వందల సంఖ్యలో ప్రీమియర్ షోలు వేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరోసారి విజయ్ చిత్రం తమిళనాడు బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
పొలిటికల్ సిస్టంలోని లోపాలను ఎత్తి చూపుతూ..... ఒక సందేశాత్మక చిత్రంగా మురుగదాస్ ఈ చిత్ర కథను అల్లారు. విజయ్ అభిమానులు మెచ్చే మాస్ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకుండా సినిమాను ఒక మంచి వినోదాత్మక చిత్రంగా మలిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాపై ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
ఇండస్ట్రీ హిట్...
సర్కార్ ఇండస్ట్రీ హిట్ అని, సినిమా అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
సినిమా అదిరిపోయింది
సినిమా అదిరిపోయిందని.... సినిమా సగం చూసినా ఫుల్ ఎంటర్టెనర్ చూసిన ఫీలింగ్ వస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఫస్టాఫ్ సూపర్
సినిమా ఫస్టాఫ్ అదిరిపోయే విధంగా ఉంది. పలువురు తమిళ రివ్యూ రైటర్ల నుంచి కూడా సినిమాకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్
సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉందని, పూర్తిగా రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.
అభిమానులు ఖుషీ
స్టైల్ పరంగా, లుక్ పరంగా విజయ్ ఈ సినిమా ద్వారా అభిమానులను మెప్పించారు. తమకు కావాల్సిన వినోదం కూడా కావాల్సినంత ఉండటం కూడా ఫ్యాన్స్ సంతోషానికి కారణం.
బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్
మరో వైపు సినీ విమర్శకుల నుంచి కూడా ఫస్టాఫ్ విషయంలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ చిత్రం భారీ విజయం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అభిమానుల సంబరాలు
మరో వైపు తమిళనాడుతో పాటు తమిళులు ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
క్లీన్, కమర్షియల్ ఎంటర్టెనర్
సర్కార్... క్లీన్, కమర్షియల్ ఎంటర్టెనర్. సినిమాలో నవరసాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారిని మెప్పించే చిత్రం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











