Sarkaru Vaari Paata: బుక్ మై షోలో మహేష్ న్యూ రికార్డ్.. ఇంకా సినిమా ఫస్ట్ లుక్ కూడా రాలేదు.. అప్పుడే భారీగా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో కొంచెంకొంచెంగా తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటు వెళుతున్నాడు. వీలైనంత వరకు కమర్షియల్ గా సేఫ్ జోన్ లో అడుగులు వేస్తున్న మహేష్ రాబోయే సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు. ఇక సర్కారు వారి పాట విడుదలవ్వక ముందే బుక్ మై షోలో ఒక రికార్డును క్రియేట్ చేసింది.

రాబోయే సినిమాలు కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఒక్కడు సినిమా నుంచి శ్రీమంతుడు వరకు తన బాక్సాఫీస్ స్టామినాతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నడు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో వెళుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు కూడా మంచి విజయాన్ని అందుకుంది. రాబోయే సినిమాలు కూడా మరో లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు.

నెవ్వర్ బిఫోర్ అనేలా.. మహేష్ యాక్టింగ్
గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త లుక్కుతో ఆకట్టుకొనున్నాడు. ఒక బ్యాంక్ అధికారిగా కనిపించబోయే మహేష్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా విబిన్నంగా ఉంటుందట. కామెడీ టైమింగ్ కూడా కొత్తగా హైలెట్ అవుతుందని చెబుతున్నారు.

బుక్ మై షోలో న్యూ రికార్డు
దీంతో సినిమాపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. అయితే ఇంతవరకు సినిమాకు సంబంధించిన టైటిల్ తప్పితే ఒక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ బుక్ మై షోలో సినిమా సరికొత్త రికార్డును అందుకుంది. ఏకంగా 25 వేలకు పైగా ఇంట్రెస్టెడ్ లైక్స్ రావడం విశేషం. పోస్టర్స్ టీజర్స్ వచ్చిన సినిమాలకు కూడా ఈ రేంజ్ లో అయితే బజ్ లేదు.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే?
చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చని సమాచారం. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి రిలీజ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. ఇక థర్డ్ వేవ్ రాకపోతే అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకి రవచ్చట. లేకపోతే సమ్మర్ లో రిలీజ్ కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











