twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సర్కారు వారి పాట'లో ఆ డైలాగ్ ఎఫెక్ట్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన పరశురామ్!

    |

    మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరగగా ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్. అయితే తాజాగా ఆయన హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే

     171 కోట్ల గ్రాస్

    171 కోట్ల గ్రాస్


    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా.

     సూపర్ సక్సెస్ కావడంతో

    సూపర్ సక్సెస్ కావడంతో


    అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డుకెక్కింది.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద ఇప్పటికీ సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం నాడు దర్శకుడు పరశురామ్ దర్శించుకున్నారు.

     సముద్ర ఖనితో ఓ డైలాగ్

    సముద్ర ఖనితో ఓ డైలాగ్


    దర్శనార్థం వచ్చిన దర్శకుడు పరశురామ్‌ ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. పరశురామ్‌ పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఇక ఈ సందర్భంగా మీడియా ఆయన పలకరించింది. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు పరశురామ్ జవాబులిచ్చారు. అయితే నిజానికి 'సర్కారు వారి పాట' సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఉద్దేశించి విలన్ పాత్రధారి సముద్ర ఖనితో ఓ డైలాగ్ చెప్పించారు.

     ఎంతో భక్తి ఉందని

    ఎంతో భక్తి ఉందని


    అయితే విలన్ తనను తాను స్వామివారితో పోల్చుకోవడం భక్తులకు నచ్చలేదు. ఇక మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని పరశురామ్ ను ఈ విషయంపై ప్రశ్నించారు. దీనిపై పరశురామ్ స్పందించారు. ఆయన స్పందిస్తూ తాను కావాలని చేయలేదని.. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించండి అని కోరారు. అంతేకాక ఆయ్న మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పై తనకు ఎంతో భక్తి ఉందని.. వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు.

     లాంగ్ రన్ లో

    లాంగ్ రన్ లో


    'సర్కారు వారి పాట' సినిమాను మొదలుపెట్టినప్పుడు స్వామిని దర్శించుకున్నానని పేర్కొన్న పరశురామ్, సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఈ సినిమా పూర్తయిన క్రమంలో త్వరలోనే నాగచైతన్యతో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఈ సినిమా 170 కోట్ల కలెక్షన్స్ సాధించగా మరిన్ని కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. చూడాలి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది.

    English summary
    sarkaru vaari paata director parasuram apologies to simhadri appanna devotees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X