Sarkaru Vaari Paata: ఆ దేశంలో మహేశ్ సంచలన రికార్డు.. అతడి కెరీర్‌లోనే తొలిసారి భారీగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ హీరోగా సందడి చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ నటుడిగానూ ఎంతో పరిణితిని పొందుతున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీనికి కారణం అతడు వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతుండడమే. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో తాజాగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

సర్కారు వారి పాటలో మహేశ్

సర్కారు వారి పాటలో మహేశ్

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

సందేశాత్మక కథతో వస్తోంది

సందేశాత్మక కథతో వస్తోంది

బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా బిజినెస్‌మ్యాన్‌లను టార్గెట్ చేస్తూ ‘సర్కారు వారి పాట'ను తీస్తున్నారట. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతే.. అప్పుడు హీరో.. తన తండ్రి కోసం విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అని అంటున్నారు. ఇందులో మహేశ్ బాబు పాత్ర హైలైట్‌గా ఉండబోతుందని టాక్.

అంచనాలకు తగ్గట్లే బిజినెస్

అంచనాలకు తగ్గట్లే బిజినెస్


క్రేజీ కాంబినేషన్‌లో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన అప్‌డేట్ల వల్ల అవన్నీ రెట్టింపు అయిపోయాయి. ఫలితంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లో అత్యధిక మొత్తానికి డీల్స్ అయ్యాయని టాక్. ఇది మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్ అవుతుందని అంటున్నారు.

ట్రైలర్‌తో నెంబర్ వన్ రికార్డ్

ట్రైలర్‌తో నెంబర్ వన్ రికార్డ్


మొదట్లో ‘సర్కారు వారి పాట' మూవీ నుంచి అప్‌డేట్లు పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో ఆ మధ్య వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. అలాగే, ఇటీవలే విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టేశాయి. ఇక, తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సత్తా చాటింది. దీంతో టాలీవుడ్‌లో నెంబర్ వన్‌ ప్లేస్‌కు చేరుకుంది.

భారీ రేటుకు ఓవర్సీస్ రైట్స్

భారీ రేటుకు ఓవర్సీస్ రైట్స్


‘సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే చాలా ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రిలీజ్ హక్కులను ఫ్లై హై సినిమాస్, శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్, క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు భారీ ధరకు సొంతం చేసుకున్నాయి.

అక్కడ రికార్డ్ స్థాయి విడుదల

అక్కడ రికార్డ్ స్థాయి విడుదల

మహేశ్ బాబు హీరోగా పరశురాం రూపొందిస్తోన్న ‘సర్కారు వారి పాట' మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్స్‌ను మే 11న వేయబోతున్నట్లు ఓవర్సీస్ బిజినెస్ చేసుకున్న సంస్థలు వెల్లడించాయి. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి అక్కడ ఏకంగా 603 లొకేషన్లలో ప్రీమియర్స్ వేయబోతున్నట్లు తెలిపారు.

Recommended Video

Sarkaru Vari Pata Trailer Sets New Records | Telugu Filmibeat
మహేశ్ కెరీర్‌లోనే తొలిసారిగా

మహేశ్ కెరీర్‌లోనే తొలిసారిగా

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ‘సర్కారు వారి పాట' మూవీని యూఎస్‌లో 603 లొకేషన్లలో విడుదల చేస్తున్నారు. ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రీమియర్ రిలీజ్ అని అంటున్నారు. ఇలా అమెరికాలో సూపర్ స్టార్ అప్పుడే ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X