Sarkaru Vaari Paata Trailer: మహేశ్ సంచలనం.. ప్రభాస్‌ రికార్డు 14 గంటల్లోనే బ్రేక్.. వామ్మో ఇదేం దండయాత్ర!

అదిరిపోయే యాక్టింగ్, హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని.. సుదీర్ఘ కాలంగా బడా హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుసగా విజయాలను అందుకుంటూ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌తో మహేశ్ బాబు సంచలన రికార్డును నమోదు చేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

పాట పాడడానికి వస్తున్నాడుగా

పాట పాడడానికి వస్తున్నాడుగా

హిట్లు మీద హిట్లు కొడుతూ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అలాంటి కథ... ఫ్యాన్స్‌కు ఫీస్టు

అలాంటి కథ... ఫ్యాన్స్‌కు ఫీస్టు

'సర్కారు వారి పాట' మూవీని బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారట. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి కోసం విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో మహేశ్ బాబు పాత్ర గతంలో చూడని విధంగా ఉంటుందట.

రికార్డులు బ్రేక్.. అత్యధిక డీల్స్

రికార్డులు బ్రేక్.. అత్యధిక డీల్స్

'సర్కారు వారి పాట' మూవీ నుంచి అప్‌డేట్లు పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో ఆ మధ్య వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఇటీవలే విడుదలైన 'కళావతి' సాంగ్‌ సైతం ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత పాటలూ హిట్ అయ్యాయి. దీంతో ఈ రెండు రికార్డులు బద్దలు కొట్టేశాయి. ఫలితంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లో అత్యధిక మొత్తానికి డీల్స్ అయ్యాయని టాక్.

ట్రైలర్ రిలీజ్.. హైలైట్ సీన్స్

ట్రైలర్ రిలీజ్.. హైలైట్ సీన్స్

'సర్కారు వారి పాట' మూవీని మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా మాస్ ట్రీట్‌తో కట్ చేశారు. ముఖ్యంగా ఇందులో మహేశ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, స్వాగ్ అదుర్స్ అనిపించాయి. ప్రతి విజువల్ కన్నుల పండుగగా ఉంది.

భారీ రెస్పాన్స్... వ్యూస్, లైక్స్

భారీ రెస్పాన్స్... వ్యూస్, లైక్స్

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'సర్కారు వారి పాట' ట్రైలర్‌కు మహేశ్ బాబు అభిమానుల నుంచే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దీనికి అత్యధిక మొత్తంలో వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. అంతేకాదు, విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ మరింతగా దూసుకుపోతోంది.

14 గంటల్లో ఆల్‌టైం రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో 'రాధే శ్యామ్' మొదటి స్థానంలో ఉంది. దీనికి ఒక్కరోజులోనే 23.2 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పుడీ రికార్డును మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' ట్రైలర్ 14 గంటల్లోనే దాటేసింది. తద్వారా రోజు గడవక ముందే టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది.

మహేశ్ బాబు సంచలనమే

మహేశ్ బాబు సంచలనమే

'సర్కారు వారి పాట' ట్రైలర్‌కు అప్పుడే యూట్యూబ్‌లో అప్పుడే దాదాపు 25 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 24 గంటలు ముగిసే సమయానికి ఇది 30 మిలియన్ మార్కును చేరుకునే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సౌత్‌లో కూడా మరిన్ని రికార్డులు బద్దలైపోయే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X