Sarkaru Vaari Paata Twitter Review: ఫస్టాప్ బాగుంది.. మహేష్ బాబు ఇరగదీశాడు.. కానీ..

మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్లు ముందే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా అలా ఉందంటూ .. అభిమానులు, నెటిజన్లు ట్విట్టర్‌లో వెల్లడించిన అభిప్రాయాలు మీ కోసం..

Recommended Video

Sarkaru Vaari Paata Public Talk In Bangalore మూవీ బాగుంది కానీ ... | Filmibeat Telugu

మహేష్ ట్రెండ్ సెట్టర్

సర్కారు వారీ పాట మూవీని జర్మనీలో చూశాను. మహేష్ సార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫైట్స్, డైలాగ్స్, లవ్ సీన్లలో మహేష్ స్టైల్ ట్రెండ్ సెట్టర్ మూవీ. యాక్షన్, లవ్, కామెడీ, డ్రామాతో రియాలిటీ మూవీగా అనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎలివేషన్ సీన్లు ఎక్కువగా లేవు.. కానీ

సినిమాలో హై మూమెంట్స్, ఎలివేటేడ్ సీన్లు ఎక్కువగా లేవు. కానీ సినిమా అలా సాగిపోయింది. పరుశురాం స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. ఆడియెన్స్‌కు మంచి అనుభూతి కలుగజేసే చిత్రం. అంచనాలు రీచ్ అవుతుంది అని మరో నెటిజన్ సినిమా గురించి ట్వీట్ చేశారు.

మంచి ఎంటర్‌టైనర్ అంటూ

లండన్‌లో ఇప్పుడే సర్కారు వారీ పాట మూవీ చూశాను. ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్ బాగుండటంతో మంచి ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్కామ్స్ విషయంలో మహేష్ బాబు టెర్రిఫిక్. కీర్తీ సురేష్ చార్మింగ్, సముద్రఖని నటన చాలా బాగుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

సినిమా బిలో యావరేజ్ అంటూ

అమెరికాలో సర్కారు వారీ పాట చూశాను. సినిమా బిలో యావరేజ్. సోది స్పీచ్ లేకుండా, సోషల్ మెసేజ్ లేకుండా మహేష్ బాబు సినిమా బాగా చేశఆడు. ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బ్యాడ్. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయింది. కానీ ఈ అంశాలు సినిమాను హిట్ చేసేలా లేవు. స్క్రీన్ ప్లే బాగాలేదు. ఎడిటింగ్ కూడా బాగాలేదు. మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకు. నా రేటింగ్ 1.5/5 అని నెటిజన్ ట్వీట్ చేశాడు.

మహర్షి సినిమాలో 10 శాతం

సర్కారు వారీ పాట సినిమా మహర్షి సినిమాలో 10 శాతం కూడా బాగాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ లేవు. మహర్షిలో రిచ్ నెస్ నెక్ట్స్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమాలో మేకింగ్ వేరీ పూర్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

మహేష్ వన్ మ్యాన్ షో

సర్కారు వారీ పాట మూవీలో మహేష్ వన్ మ్యాన్ షో. ఆయన ఎనర్జీ, డైలాగ్ టైమింగ్ బాగున్నది. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సెకండాఫ్ యావరేజ్‌గా ఉంది. సూపర్ స్టార్ నుంచి మరో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. థమన్ నిరాశపరిచాడు. ఒకే అనిపించేలా మూవీ ఉంది అని ఓ నెటిజన్ తన రివ్యూను పోస్టు చేశాడు.

నాసిరకం డైరెక్టర్ అంటూ

సర్కారు వారీ పాట మూవీలో కొన్ని మంచి సీన్లు ఉన్నాయి. ఇలాంటి నాసిరకం డైరెక్టర్లతో పనిచేయడం మానేయాలి. మెయిన్ స్ట్రీమ్‌లో రాబోయే ఆయన సినిమాలు లైనప్ బాగుంది. మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమా మాదిరిగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. సినిమా అంత గొప్పగా లేదు. నా రేటింగ్ 2.25/5 అని ఓ నెటిజన్ రేటింగ్ ఇచ్చాడు.

సెకండాఫ్ గ్రాఫ్ తగ్గింది అంటూ

ఫస్టాఫ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. సెకండాఫ్ కాస్త గ్రాఫ్ తగ్గింది. మహేష్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మహేష్ డైలాగ్ డెలివరీ బాగుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

కామెడీతో అలా సాగింది..

ఫస్టాఫ్ ఏదో అలా అలా కామెడీతో సాగిపోయింది. బిలో యావరేజ్ స్టఫ్ కానీ బీచ్ ఫైట్ మాత్రం ఫైర్ ర్యాంప్ అందించాడు బాబు. ఇంట్రో బీజీఎం, బీచ్ ఫైట్ ఓన్లీ పాజిటివ్. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కొంత బెటర్‌గా ఉంది. బాబు యాక్టింగ్ కుమ్మేశాడు. కీర్తీ సురేష్‌తో లవ్ ట్రాక్ సినిమాకు డ్రాబ్యాక్. మిగితాది అంతా మాస్ స్టఫ్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

బీచ్ ఫైట్ అదిరిపోయింది అంటూ

సర్కారు వారీ పాట ఫర్‌ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో. ఫస్టాఫ్‌లో కళావతి సీన్లు బాగున్నాయి. బీచ్ ఫైట్, ఇంటర్వెల్ సీన్లు బాగున్నాయి. సెకండాఫ్ లారీ సీన్ సినిమాకు హైలెట్. బ్యాంకులు, బ్యాంక్ స్కామ్స్ గురించి డైలాగ్స్ బాగున్నాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X