నో ఫంక్షన్ : డైరెక్టర్‌గా రిలీజైన ‘సారొచ్చారు’ ఆడియో
హైదరాబాద్ : మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న 'సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైంది. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్ వివరాలు
1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు
గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాత అశ్వినీదత్. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై నిర్మిస్తున్నారు. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











