రవితేజ ‘సారొచ్చారు’ ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్
హైదరాబాద్ : మాస్ మహరాజ రవితేజ హీరోగా రూపొందుతున్న 'సారొచ్చారు' చిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. రేపు(డిసెంబర్ 5)న ఈచిత్రం ఆడియో హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తాజాగా ఈచిత్రం ఆడియో ట్రాక్ లిస్టు కూడా బయటకు వచ్చింది.
ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్ వివరాలు
1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు
ఇది వరకు రవితేజ-దేవిశ్రీ కాంబినేషన్లో ఖడ్గం, వెంకీ, భద్ర లాంటి మ్యూజకల్ హిట్స్ వచ్చాయి. ఇటీవల రింగ రింగ, కెవ్వు కేక లాంటి హాట్ ఐటం నెంబర్లు కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్...'సారొచ్చారు' చిత్రం కోసం 'రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











