రవితేజ ‘సారొచ్చారు’ లేటెస్ట్ అప్డేట్స్
హైదరాబాద్: రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సారొచ్చారు'. 'మంచి ప్రేమ కథతో' అనేది సబ్ టైటిల్. తాజాగా ఈచిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు ముగించి డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈచిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఊటీ, యూరఫ్, హైదరాబాద్ లలో నిర్వహించారు. దర్శకుడు పరశురామ్ ఈచిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.
ఈచిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన రవితేజ వరుస మూస సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. అదే విధంగా నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండనున్నాయి.
కాగా... ఈచిత్రం ఆడియో నవంబర్ 30వ తేదీనే విడుదల చేస్తున్నట్లు చెప్పినా... ఎందుకనో ఆడియో విడుదల కాలేదు. త్వరలోనే ఈ చిత్రం ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











