సరోజ్ ఖాన్ ది గ్రేట్.. సెప్పులకు మెచ్చి హీరోయిన్‌కు రూ.101 బహుమానం

ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ సరోజ్ ఖాన్ ఇకలేరనే వార్త అందర్నీ విషాదంలో ముంచెత్తింది. అయితే ఆమెతో పనిచేసిన అనుభవాన్ని, ప్రతిభను గుర్తు చేసుకొంటూ తమ విషాదం నుంచి తేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజ్ ఖాన్ ముంబైలోని గురునానక్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఈ సందర్భంగా సరోజ్ ఖాన్‌తో ఉన్న ఓ మధురమైన విషయాలను బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చేసుకొంటూ..

2012లో రౌడీ రాథోడ్ సినిమా షూటింగ్‌లో సరోజ్ ఖాన్‌ను కలిశాను. చమ్మక్ ఛల్లో పాటకు రిహార్సల్ చేస్తుంటే ఆమె నాకు మూమెంట్స్ చెబుతున్నది. కొన్నిసార్లు స్టెప్స్ తప్పుగా చేస్తే దానిని సరిచేశారు. తాను చెప్పిన స్టెప్పులు సరిగ్గా చేస్తే నాకు రూ.101 బహుమతిగా ఇచ్చారు అని సోనాక్షి చెప్పారు. సరోజ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్టును కూడా పెట్టారు.

Saroj khan given Rs.101 gift for Sonakshi Sinha for Rowdy Rathore song

లవ్ యూ మాస్టర్. నాకు అప్పుడు 23 ఏళ్లు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను రెండో సినిమాలో నటిస్తు్నాను. ఆ సమయంలో మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమనిపించింది. మీరు ఫర్‌ఫెక్షనిస్ట్, టాస్క్ మాస్కర్, లెజెండ్ అని అప్పుడే నాకు తెలిసింది. ఆ సమయంలో నేను వేసిన స్టెప్పులను మెచ్చుకొని.. నా పేరు ఈ అమ్మాయి నిలబెడుతుంది అని చెప్పిన విషయాలు అమ్మకు చెబితే ఆమె చాలా ఆనందపడింది. మీరు గిఫ్టుగా ఇచ్చిన 101 రూపాయలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అని సోనాక్షి సిన్హా అన్నారు.

ఇదిలా ఉండగా, సరోజ్ ఖాన్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఆమె అంత్యక్రియలు ముంబైలోని మలాడ్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X