twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరోజ్ ఖాన్ మరణానికి ముందు ఆఖరి సందేశం అదే.. సుశాంత్ సింగ్ గురించి బాధపడుతూ..

    |

    సుశాంత్ సింగ్ మరణవార్త గురించి ఇంకా కొలుకోకముందే మరో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇండియన్ సినిమా హిస్టారిలో కొరియోగ్రాఫర్ గా చెరగని ముద్ర వేసుకున్న సరోజ్ ఖాన్ కొన్ని గంటల క్రితం గుండెపోటుతో మరణించారు. నేడు తెల్లవారుజామున ఆమె మరణవార్త గురించి తెలియగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే సరోజ్ ఖాన్ చివరగా అభిమానులకు సినీ లోకానికి ఇచ్చిన ఒక ఒక్క సందేశం.. సుశాంత్ మరణంపైనే..

     అకస్మాత్తుగా మృతి చెందడం..

    అకస్మాత్తుగా మృతి చెందడం..

    డ్యాన్స్ మాస్టర్ గా ఎన్నో సాంగ్స్ కంపోజ్ చేసిన ఆమె అకస్మాత్తుగా మృతి చెందడం సినీ ప్రముఖులను కలచి వేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలే కాకుండా ఎంతో మంది సౌత్ సినీ ప్రముఖులు కూడా ఆమె మరణంపై స్పందిస్తున్నారు. ఆమెతో గడిపిన క్షణాలనే కాకుండా ఆమె ఇచ్చిన సందేశాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు.

    చివరి కామెంట్స్..

    చివరి కామెంట్స్..

    ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు చురుగ్గా కనిపించే సరోజ్ ఖాన్ ప్రపంచానికి ఇచ్చిన చివరగా మెస్సేజ్ సుశాంత్ సింగ్ మృతిపైనే.. ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో మరణించడంపై ఆమె ఎంతగానో బాధపడ్డారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో సుశాంత్ సింగ్ ఫోటో పోస్ట్ చేసి ఎమోషనల్ గా స్పందించారు. ప్రస్తుతం కూడా ఆ మెస్సేజ్ వైరల్ గా మారింది.

    సరోజ్ ఖాన్ ఏమన్నారంటే..

    సరోజ్ ఖాన్ ఏమన్నారంటే..

    సరోజ్ ఖాన్ ఏమన్నారంటే.. నేను నీతో ఎప్పుడు వర్క్ చేయలేదు. కానీ మనం చాలా సార్లు కలిసాము. నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరిగాయో తెలియదు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా షాక్ అయ్యాను. అనుభవం ఉన్న ఒక పెద్ద వారితో మాట్లాడితే బాగుండేది. అలాంటివి ఎంతగానో సహాయ పడతాయి. మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.

    ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా..

    ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా..

    జరిగిన విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది. నీ ఆత్మకు శాంతి కలగాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇక ప్రస్తుతం మీ నాన్న, సోదరి ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు. వారికి కూడా బలాన్ని చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నీ సినిమాలన్నిటిని చూశాను. వాటిని ఎంతగానో ప్రేమించాను. అలాగే ఎప్పటికి నిన్ని అభిమానిస్తూనే ఉంటాము అని సరోజ ఖాన్ జూన్ 14వ తేదీన చివరగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

    Saroj khan last comments on sushanth singh rajput

    English summary
    Another tragedy occurred in Bollywood. Saroj Khan, who became a choreographer in the history of Indian cinema, died of a heart attack a few hours ago. When the news of her death came to light at dawn today, the Bollywood film industry was suddenly struck. Her sudden death as a dance master composes many songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X