»   » సరైనోడు: బొలీవియా గడ్డపై బన్నీ హడావుడి (ఫోటోస్)

సరైనోడు: బొలీవియా గడ్డపై బన్నీ హడావుడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా యూనిట్ ఓ మెలొడీ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఇటీవల బొలీవియా దేశం వెళ్లారు. ఐదురోజుల్లో అక్కడ షూటింగ్ కంప్లీట్ అయింది.

'తెలుసా తెలుసా' అనే సాంగును అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించారు. సాంగ్ చిత్రీకరణ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించారు. సాంగ్ చిత్రీకరణ పూర్తయిన అనంతరం టీం మొత్తం కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.


ఇటీవల విడుదలైన సరైనోడు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో బన్నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 'ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాననుకున్నావేమో...మాస్ ఊరమాస్' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగనచ్చేసింది. లుక్ పరంగా కూడా బన్నీ గత సినిమాలకంటే భిన్నంగా....మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.


తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


బొలీవియాలో..

బొలీవియాలో..

బోలీవియాలో షూటింగ్ సందర్భంగా అల్లు అర్జున్.


సాంగ్

సాంగ్

‘తెలుసా తెలుసా' అనే సాంగును అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించారు.


టీం

టీం

సాంగ్ చిత్రీకరణ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించారు. సాంగ్ చిత్రీకరణ పూర్తయిన అనంతరం టీం మొత్తం కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


బన్నీ

బన్నీ

అల్లు అర్జున్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.


సరైనోడు

సరైనోడు

అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతోంది.


English summary
The ‪#‎Sarrainodu‬ crew is super done with Thelusa Thelusa song in Bolivia.
Please Wait while comments are loading...