twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ సినిమా.. మరే ఇండియన్ హీరోకి దక్కని అరుదైన రికార్డ్!

    |

    Recommended Video

    Allu Arjun Movie Breaks Records In Youtube

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. డాన్స్, నటన, తన మేకోవర్ విషయంలో బన్నీ ప్రతి చిత్రంలోనూ అభిమానులని ఉర్రూతలూగిస్తుంటాడు. బన్నీకి తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. సరైనోడు చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఈ చిత్రాన్ని గత ఏడాది మే నెలలో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. మరే ఇండియన్ సినిమాకు సొంతం కానీ రికార్డుని సరైనోడు చిత్రం అందుకుంది.

    మాస్ యాక్షన్

    మాస్ యాక్షన్

    పక్కా బోయపాటి శైలిలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ యాక్షన్ అంశలతో బంపర్ హిట్ కొట్టింది. బన్నీ కెరీర్ లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.

    ఏ హీరోకి సాధ్యంకాని రికార్డు

    ఏ హీరోకి సాధ్యంకాని రికార్డు

    సరైనోడు చిత్రం అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 200 మిలియన్ల వ్యూస్ తో ఈ చిత్రం దూసుకుపోతుండడం విశేషం. ఈ రికార్డు ఇంత వరకు మరే ఇండియన్ హీరో సినిమాకు దక్కలేదు.

    అత్యధిక లైక్స్

    అత్యధిక లైక్స్

    అదేవిధంగా అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా కూడా సరైనోడు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని 6,65,000 లైక్స్ దక్కడం విశేషం. కావలసినంత మసాలా, ఎంటర్ టైనింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉండడంతో నెటిజన్లు ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.

    దుమ్మురేపుతున్న దువ్వాడ

    దుమ్మురేపుతున్న దువ్వాడ

    సరైనోడు చిత్ర రికార్డు ఎక్కువరోజులు నిలబడే అవకాశం లేదు. డీజే చిత్రంతో బన్నీ తన రికార్డు తానే అధికమించబోతున్నాడు. గత ఏడాది విడుదలైన దువ్వాడ జగన్నాథం చిత్రం కూడా హిందీలో డబ్ అయింది. సరైనోడు కంటే వేగంగా ఈ చిత్రం వ్యూస్ సాధిస్తుండడం విశేషం. ఇప్పటికే 175 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. త్వరలోనే 200 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయం.

    English summary
    Sarrainodu gets all time Indian cinema in Youtube. Creates new record in terms fo views and likes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X