బోలీవియాలో ల్యాండైన ‘సరైనోడు’ టీం (ఫోటో)
హైదరాబాద్: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా యూనిట్ ఓ మెలొడీ సాంగ్ చిత్రీకరణలో భాగంగా బొలీవియా దేశం వెళ్లారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ ఫ్లాట్ పాం ద్వారా ఓ ఫోటో రీలీజ్ చేసారు.
ఇటీవల విడుదలైన సరైనోడు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో బన్నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాననుకున్నావేమో...మాస్ ఊరమాస్' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగనచ్చేసింది. లుక్ పరంగా కూడా బన్నీ గత సినిమాలకంటే భిన్నంగా....మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.
టీజర్ విడుదల తర్వాత పబ్లిసిటీ ఉధృతం చేసారు. ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రస్తుతం ప్రతి రోజూ ప్రదర్శితం అవుతోంది. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తలుచుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేయగలరు. ఆయనకు ఇండస్ట్రీలో అంత ఇన్ ఫ్లూయెన్స్ ఉంది. మరి అలాంటి వ్యక్తి స్వయంగా తాను నిర్మిస్తున్న సినిమా, పైగా తన కొడుకు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో......తన పలుకుబడి అంతా ఉపయోగించబోతున్నారు. సినిమా రిలీజ్ విషయంలో తన విశ్వరూపం చూపించబోతున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భగా ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











