ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ‘సరైనోడు’ టీజర్
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ నేడు విడుదల చేయబోతున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్ర 4 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
సరైనోడు లోకేషన్లో సందడే సందడి (ఫోటోస్)

టీజర్ విడుదల తర్వాత పబ్లిసిటీ ఉధృతం కాబోతోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తలుచుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేయగలరు. ఆయనకు ఇండస్ట్రీలో అంత ఇన్ ఫ్లూయెన్స్ ఉంది. మరి అలాంటి వ్యక్తి స్వయంగా తాను నిర్మిస్తున్న సినిమా, పైగా తన కొడుకు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో......తన పలుకుబడి అంతా ఉపయోగించబోతున్నారు. తన విశ్వరూపం చూపించబోతున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భగా ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











