వరుడు విలన్ తో హాట్ స్టార్ త్రిష చేసిన...
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన వరుడు చిత్రంలో విలన్ గా చేసి అదరకొట్టిన ఆర్య సరసన త్రిష ఓ చిత్రం చేసింది. విష్ణువర్థన్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది, విజయం సాధించిన 'సర్వం' చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమై రిలీజుకు రెడీ అవుతోంది. సెన్సార్ పనులు సైతం పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నిర్మాతల మండలి హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
దర్శకుడు విష్ణువర్థన్ మాట్లా డుతూ "సర్వం అంటే అన్నీ. ఇది రొమాంటిక్ థ్రిల్లర్. సినిమాలోనూ, ఆర్య పాత్రలోనూ రెండు ఛాయలుంటాయి. ఆర్య ఇందులో డైనమిక్ అయిన ఓ ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తే, త్రిష డాక్టర్‌గా కనిపిస్తుంది. నెగటివ్ ఛాయలుండే పాత్రలో జెడి చక్రవర్తి ఆకట్టుకుంటారు. ఈ చిత్ర కథ ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ నడుస్తుంది. యువన్‌శంకర్ రాజా సంగీతం సమకూర్చిన పాటలు చిత్రానికి ఎస్సెట్. సినిమా మొత్తం దృశ్యపరంగా బాగా ఆకట్టుకుంటుంది" అని చెప్పారు. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు రాసిన ఈ చిత్రానికి వెన్నెలకంటి, భువనచంద్ర పాటలు రాశారు.


Click it and Unblock the Notifications











