వైవిధ్యం కోసం శర్వానంద్ 'ప్రస్థానం'
వి.ఆర్.సి.మీడియా & ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రూపొందుతున్న చిత్రం 'ప్రస్థానం'. వెన్నెల చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు దేవా కట్టా రూపొందిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఆగష్టు 16 నుండీ మొదలు కాబోతోంది. గమ్యం చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని, రాజు మహారాజు చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడూ చేరువైన శర్వానంద్ కథానాయకుడుగా నటిస్తున్నారు. వెన్నెల చిత్రంలో శర్వానంద్ ను భిన్నమైన కోణంలో చూపించిన దేవా ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నాడన్నది ఆశక్తికరాంశం. ఇందులో 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ మునుపెన్నడూ చేయనటువంటి వైవిధ్యమైన పాత్రను పోషిస్తన్నట్టు తెలిసింది.
ఈ మధ్యే విడుదల చేసిన చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో శర్వానంద్ డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. 'గాయం' చిత్రంలో జగపతిబాబు పాత్ర తరహాలో వుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో శర్వానంద్ కు జోడీగా ఢీల్లీ భామ రూబీ పరిహార్ కథానాయికగా నటిస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న స్నేహగీతం చిత్రంలో నటించిన సందీప్ కిషన్ ఓ ముఖ్యభూమికను పోషిస్తున్నారు. 'వెన్నెల' కిషోర్, రవిప్రకాష్, సురేఖా వాణి, జయప్రకాష్ రెడ్డి, జీవా లు ప్రధాన పాక్రలు పోషిస్తున్నారు. 'వెన్నెల' ఫేం మహేష్ శంకర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











