twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కో అంటే కోటి’తో జ్ఞానోదయమైంది: శర్వానంద్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్య 'కో అంటే కోటి'తో నిర్మాతగా మారారు నటుడు శర్వానంద్. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సినిమా వల్ల నాకు లాభమొచ్చిందా, నష్టమొచ్చిందా అనే విషయం పక్కన పెడితే ఓ విషయంలో జ్ఞానోదయమైంది. సినిమా నిర్మాణం ఎంత కష్టమో, నిర్మాత పరిస్థితి ఏమిటో అర్థమైంది. అయినా మళ్లీ సినిమా తీస్తాను. అయితే ఇప్పుడు కాదు. నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తా అన్నారు.

    ఇక రీసెంట్ గా ఆయన వర్మ దర్శకత్వంలో కమిటైన సత్య 2 ప్రాజెక్టు గురించి చెప్తూ...'కో అంటే కోటి' షూటింగ్ టైమ్‌లో ఆయన్ని కలిశాను. అప్పుడే 'సత్య 2' కథ చెప్పారు. నేను బాగా ఇంప్రెసయ్యా. ఏదో కథ చెప్పారనుకున్నాగానీ, అందులో నన్నే హీరోగా తీసుకుంటున్నారని నాకు తెలీదు. తెలిశాక చాలా షాకయ్యాను. వర్మ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. మొన్నే ముంబయ్‌లో అయిదు రోజులు షూటింగ్ చేసొచ్చా. మళ్లీ వెళ్లాలి అన్నారు.

    తనకు ఇన్‌స్పిరేషన్ గురించి చెప్తూ... ఆమిర్‌ఖాన్....ఆయన కథల ఎంపికే చాలా విభిన్నంగా ఉంటుంది. ఓసారి 'రంగ్‌దే బసంతి'... ఇంకోసారి 'తారే జమీన్‌పర్'... మరోసారి 'త్రీ ఇడియట్స్'. తన సినిమాల్లో మంచి ఫీల్‌తో పాటు జనాకర్షణ శక్తి ఉంటుంది. నాది మొదటినుంచీ అదే పంథా. అదృష్టవశాత్తూ మంచి కథలు దొరుకుతున్నాయి. కామెడీ అనో, మాస్ అనో ఒక బ్రాండ్‌కి పరిమితం కావడం నాకిష్టం లేదు. శర్వానంద్ మంచి నటుడు అనిపించుకోవాలనేదే నా లక్ష్యం. అలాగని మాస్ చేయనని కాదు అన్నారు.

    ప్రస్తుతం 'ఏమిటో ఈ మాయ' షూటింగ్ చాలా రోజులుగా చెన్నైలోనే జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే ఉండాలి. చెన్నైలో స్థిరపడతానా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేను. నటుడనే వాడు ఏ భాషలో అవకాశమొచ్చినా చేయాలి కదా. నేనూ అంతే. తమిళంలో నాకు బాగానే క్రేజ్ వచ్చినచ్చింది. తెలుగులో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇంతకుముందు మురుగదాస్ నిర్మాణ సంస్థలో 'జర్నీ' చేశా. ఇప్పుడేమో ప్రముఖ దర్శకుడు చేరన్‌తో చేస్తున్నా. తమిళం కూడా నేర్చుకున్నా. డబ్బింగ్ కూడా చెప్పాలనుకుంటున్నా అన్నారు.

    English summary
    
 Sarawanand says that his Ko Ante Koti film gives knowledge about Film production. Directed by Anish Yohan Kuruvilla and Produced by Sharwanand under his own Sarvaa Arts banner. Music scored by Sri Vasanth. Sharwanand, Priya Anand and Srihari are in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X