యాక్షన్ థ్రిల్లర్ ( 'కో అంటే కోటి' ప్రివ్యూ )
హైదరాబాద్: కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలతో,పాత్రలతో ముందుకు సాగుతున్న శర్వానంద్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'కో అంటే కోటి'. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఆవకాయ బిర్యాని ఫేమ్ అనీష్ కురువిల్లా దర్శకుడు. శర్వా ఆర్ట్‌స బేనర్‌పై మైనేని వసుంధరదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
వంశీ అనే అనాథ కథ ఇది. నాకెవరూ చెప్పలేదు..బతుడం ఎలానో..! బతికే దారే లేనప్పుడే.. మంచో.. చెడో..ఎలానో బతికేయడమే కావాలి..అనే డైలాగ్‌లోనే సినిమా కథంతా ఉంది. రా(నాటు).. సబ్జెక్ట్ ఇది. కథ డబ్బు చుట్టూ తిరిగినా డబ్బే లోకం కాదు. ప్రస్థానం..కంటే శర్వానంద్ ని ఓ మెట్టు పెంచే సినిమా ఇది.
శర్వానంద్ మాట్లాడుతూ...''డబ్బుకు లోకం దాసోహం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. మనిషి డబ్బు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. పది రూపాయలు కలిసొస్తుందంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.కోటి వస్తుందంటే వదులుతాడా? అందుకే నోట్ల కట్టల వెంట ఓ యువకుడు పరుగులు పెట్టాడు. మరి ఆ రూ.కోటి అందుకొన్నాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే'' అన్నారు.
చిత్ర దర్శకుడు అనీష్ యోహాన్ కురువిల్ల మాట్లాడుతూ ప్రతి మనిషికి ఏదో నమ్మకం ఉంటుందని, తమ సినిమాకు మాత్రం కథ, టీమ్ నమ్మకంగా ఉంటుందని, చిత్రాన్ని పూర్తి ఫ్యాషన్‌తో నిర్మించామని తెలిపారు. అలాగే శ్రీహరి కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. సత్య పాత్రలో ప్రియా ఆనంద్ సరిగ్గా సరిపోయింది. రాజమండ్రి యాసలో సొం తంగా డబ్బింగ్ కూడా చెప్పింది.
బ్యానర్ : శర్వా ఆర్ట్స్
నటీనటులు: శర్వానంద్,శ్రీహరి, ప్రియా ఆనంద్, త్రాగుబోతు రమేష్, పృధ్వీ, వినయ్ వర్మ, ప్రభాకర్ తదితరులు.
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం: శక్తికాంత్ కార్తీక్,
ఛాయాగ్రహణం : ఎరుకుళ్ళ రాకేష్, నవీన్ యాదవ్
నిర్మాత: మైనేని వసుంధరాదేవి,
దర్శకత్వం: అనీష్ యోహాన్ కురువిల్లా.
విడుదల తేదీ: డిసెంబర్ 28, 2012


Click it and Unblock the Notifications











