హాంకాంగ్ లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రం
''మా 'సశేషం' చిత్రాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు హాంకాంగ్‌లో కూడా విడుదల చేయబోతున్నాం. హాంకాంగ్‌లో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా మాదే అవుతుంది'' అని దర్శక, నిర్మాత శ్రీ కిషోర్ తెలిపారు. విక్రమ్‌శేఖర్, సుప్రియ జంటగా గ్రీన్ యాపిల్ క్రియేషన్స్ సమర్పణలో క్లాప్‌బోర్డ్ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రం 'సశేషం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే..."ఆద్యంతం 'సశేషం' ఉద్వేగభరితంగా ఉంటుంది. అందరూ కొత్తవారితో సినిమా తీశాం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది.సినిమా సంతృప్తికరంగా వచ్చింది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు తెస్తుంది. అన్నీ కోణాల్లోనూ సినిమా మెప్పిస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం. హాంకాంగ్‌లో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రం ఇదే'' అని కిషోర్ అన్నారు.
ఈ సందర్భంగా హీరో విక్రమ్ శేఖర్ మాట్లాడుతూ - ''తొలి చిత్రంతోనే నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించడం ఆనందంగా ఉందనివిభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఎవ్వరూ ఊహించని సన్నివేశాలు ఇందులో ఉంటాయి. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ హైలైట్‌గా కుదిరాయి'' అని చెప్పారు. ఈ చిత్రాన్ని గ్రీన్ యాపిల్ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది. క్లాప్ బోర్డ్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతోంది. సెన్సార్ పూర్తయింది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: బాలాజీ సనాల, మాటలు: అనిల్ చోడిశెట్టి, కెమెరా: జి.ఎల్.బాబు, కూర్పు: మధుసూదన్, పాటలు: సదాచంద్ర, సంగీతం: కె.సి.మౌళి, సమర్పణ: దొడ్డపనేని మురళీకృష్ణ, సహ నిర్మాతలు: దొడ్డపనేనని వెంకటేశ్వరరావు, దొడ్డపనేని రామారావు, రాజిని రెడ్డి మలిచేటి, నిర్మాత, దర్శకత్వం: శ్రీ కిషోర్.


Click it and Unblock the Notifications











