హైదరాబాద్ చరిత్ర ఆధారంగా...‘జహాపనా’
హైదరాబాద్ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? ఒకప్పుడు హైదరాబాద్ ను భాగ్యనగరి అని ఎందుకు పిలిచేవారు? చార్మినార్ కట్టడం వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? అనే అంశాలను బేస్ చేసుకుని ఓ సినిమా రూపొందబోతోంది. 'జహాపన' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఆర్.వి.రమణ మూర్తి తెరకెక్కించబోతున్నారు. గతంలో గులాబి లాంటి మ్యూజికల్ హిట్ కు సంగీతం అందించిన శశిప్రీతం ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత వెల్లడిస్తూ....ఆ కాలంలో భాగ్యనగరిని ఏలిన ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు యువరాజు కులీ తన సంస్థానంలోని అద్భుత సౌందర్యరాశి, నర్తకి..భాగమతిని ప్రేమించాడు. ప్రేమకానుకగా తను పాలిస్తున్న నగరానికి ఆమె పేరునే పెట్టాడు. చరిత్రలో ఇదో విజయవంతమైన కథ. ఈ కథనే 'జహాపనా' పేరుతో తెరకెక్కిస్తున్నాం. భాగమతి పాత్రధారి కోసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న కొత్త హీరోయిన్‌ని వెతుకుతున్నాం..అన్నారు. గతంలో నిర్మించిన 'అభినందన'కు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా రూపొందబోతోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











