తరుణ్,జెనీలియా జంటగా కృష్ణవంశి రూపొందించిన శశిరేఖా పరిణయం సినిమా ఈ రోజు(జనవరి ఒకటి) కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో రిలీజ్ కావటం లేదు. ప్రస్తుతం ఇదే విషయంపై జెమీనీ ల్యాబ్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి,నిర్మాతకు మధ్య చోటు చేసుకున్న వివాదం నడుస్తోంది. ఇక ఈ రోజు రిలీజ్ కి ప్లాన్ చేసిన మెంటల్ కృష్ణ,ఇందుమతి,మహానగరంలో,సత్యం ఐపియస్ యధావిధిగా రిలీజ్ అయ్యాయి. అయితే శశిరేఖా పరిణయం సినిమాపై బయట పాజిటివ్ టాక్ ఉంది. ఎందకు రిలీజ్ అవటంలేదనేది ఇంకా బయటకు రాలేదు. అన్నీ కుదిరితే మాట్నీ నుంచి రిలీజ్ చేస్తారంటున్నారు. కృష్ణవంశి సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవటం ఇదే మొదటసారి. అయితే కొత్త సంవత్సరం మొదట రోజునే ఇలాంటి వివాదం చోటు చేసుకోవటం అందరినీ బాధిస్తున్న విషయం.