Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘భరత్ అనే నేను’ మరో రికార్డ్... భారీ ధరకు శాటిలైట్ రైట్స్!
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీ రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో పలికాయి.
ఓ ప్రముఖ తెలుగు ఎంటర్టెన్మెంట్ ఛానల్ రూ.22 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో 'భరత్' అనే నేను నాన్ బాహుబలి రికార్డులన్నింటికీ బద్దలు కొట్టినట్లయింది.
'భరత్ అనేను' ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ రూ. 205 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
'శ్రీమంతుడు' తర్వాత వరుసగా రెండు పరాజయాలు చూసిన మహేష్ బాబు మళ్లీ అదే దర్శకుడితో ఈ సినిమా చేసి భారీ హిట్ కొట్టారు. రెండేళ్లుగా హిట్ లేక తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న మహేష్ బాబు ఈ విజయంతో ఉపశమనం పొందారు. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.