twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిమ్మ తిరిగే ధరకు 'సాహో' శాటిలైట్ హక్కులు.. ప్రభాస్ క్రేజ్ అంటే ఇది!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు నేషనల్ లెవల్ లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ మాత్రమే. అందుకే ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు మొదలుపెట్టింది.

    చివరి దశలో

    చివరి దశలో

    బాహుబలి2 పూర్తయిన తర్వాత ప్రభాస్ సాహో చిత్రాన్ని ప్రారంభించాడు. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.

     శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ప్రైజ్

    శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ప్రైజ్

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొని ఉంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో జాతీయ వ్యాప్తంగా టీఆర్పీ రేటింగులు వర్షం కురుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన టెలివిజన్ సంస్థలు సాహో శాటిలైట్ హక్కుల కోసం ఎగబడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సంస్థ సాహో శాటిలైట్ హక్కుల 70 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే మరే చిత్రానికి సాధ్యంకాని రికార్డు ఇది.

    మూడు భాషల్లో

    మూడు భాషల్లో

    సదరు సంస్థ మూడు భాషలకు కలపి 70 కోట్లుకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందట. దీనితో సాహో చిత్రం విడుదల కాక ముందే నిర్మాతల పాకెట్స్ లో 70 కోట్లు చేరిపోయినట్లు అయింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దేశ వ్యాప్తంగా సాహో చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుందని అంచనాలు మొదలవుతున్నాయి.

    యూవీ క్రియేషన్స్

    యూవీ క్రియేషన్స్

    యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ నటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విదులైన మేకింగ్ వీడియో 10 మిలియన్లపైగా వ్యూస్ తో అదరగొట్టింది. మ్యూజిక్ త్రయం శంకర్, ఇషాన్, లోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Satellite rights of Prabhas starrer ‘Saaho’ to be sold for a whopping amount. Directed by Sujeeth, the action thriller stars Shraddha Kapoor opposite Prabhas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X