శాటిలైట్ రైట్స్: ‘టెంపర్’ లేచిపోయే రేటొచ్చింది

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'టెంపర్' చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Satellite rights of 'Temper' sold out for a large

తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 18న ‘టెంపర్' ఆడియో వేడుక జరుపాలని చూస్తున్నట్లు టాక్. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X