Just In
- 6 hrs ago
హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
- 7 hrs ago
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!
- 8 hrs ago
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- 9 hrs ago
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్.. ఆనంద్ కోసం ఆ పని కూడా చేస్తాడట
Don't Miss!
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
బాహుబలి : ‘కట్టప్ప’ లుక్ ఇదే (ఫోటో)
హైదరాబాద్: బాహుబలి సినిమాకు సంబంధించిన రోజుకో క్యారెక్టర్ లుక్ విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. తాజాగా సత్యరాజ్ పోషించిన ‘కట్టప్ప' ఫస్ట్ లుక్ విడుదల చేసారు. రాజమౌళి ‘బాహుబలి' షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల మీదే తన దృష్టి కేంద్రీకరించారు. మరో వైపు డే బై డే సినిమాకు సంబంధించిన వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
A lifetime of living by the code of Honour…Does it lift your chest high in Pride? OrWeigh you down in Pain?? - SS Rajamouli#Kattappa #TheSlaveWarrior #Baahubali #LiveTheEpic
Posted by Baahubali on Friday, May 15, 2015
ఇప్పటికే ఫస్టలుక్ పోస్టర్ తో పాటు సినిమాలోని ముఖ్యపాత్రలు శివుడు, దేవసేన, కాలకేయ, శివంగి, బిజ్జలదేవ పోస్టర్లు విడుదల చేసారు. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శివుడు, బాహుబలిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. బాహుబలి' సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మేడే సందర్భంగా విడుదల చేసారు. మే 31న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అప్పటి వరుక సినిమాలోని వివిధ ప్రాతలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాకు పబ్లిసిటీ కల్పించాలని ప్లాన్ చేసారు.
తొలి చిత్రం నుంచి రాజమౌళి తన చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ట్విస్ట్,గ్రాఫిక్స్, డైలాగులు, ఎమోషన్,యాక్షన్ ఇలా అన్ని కలగలపి ఆయన ఇంటర్వెల్ క్రియేట్ చేస్తూంటారు. అసలు ఆయన చిత్రాలు ఇంటర్వెల్ మొదట అనుకుని తర్వాత మిగతా కథ డిజైన్ చేస్తారా అన్నట్లు ఉంటాయి. ఈ నేపధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలిలో ఇంటర్వెల్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తకరమైన చర్చగా మారింది. అయితే ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్ లు ఉంటాయి అంటున్నారు.

అంటే రెగ్యులర్ గా వచ్చే ఇంటర్వెల్ ఒకటి...ప్రీ క్లైమాక్స్ సైతం ఇంటర్వెల్ స్దాయిలో కథను మలుపు తిప్పేలా డిజైన్ చేసారని, అక్కడ ఓ ట్విస్ట్ వస్తుందని, అలాగే...యాక్షన్ తో ప్రేక్షకుడు షాక్ కు గురి అవుతాడని అంటున్నారు. ఆ స్ధాయిలో రాజమౌళి ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను డిజైన్ చేసాడని చెప్పుకుంటున్నారు.
తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని, అందుకే విడుదల ఆలస్యం అవుతున్నట్లు రాజమౌలి తెలిపారు.
‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ అయ్యాయి. అబ్బుర పరిచేలా ఉన్న సెట్టింగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నారు.