»   » బాహుబలిని అందుకే చంపాను: కట్టప్ప మాటలకి పడీ పడి నవ్వారు

బాహుబలిని అందుకే చంపాను: కట్టప్ప మాటలకి పడీ పడి నవ్వారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..? ఏడాదిన్న‌ర‌గా దేశ వ్యాప్తంగా సినిమా ల‌వ‌ర్స్ అంతా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోంది. ఆ సీన్‌ల‌కు ఎవ‌రికీ లీక్ చెయ్య‌కుండా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సీక్రెట్‌గా ఆ ముగ్గురు ఉన్న‌ప్పుడే తెర‌కెక్కించాడ‌ట‌. అంటే ఇక ఎవరికీ తెలిసే చాన్స్ లేదు. ఆ ముగ్గురు ఎవ‌రంటే.. ఒక‌రు హీరో ప్ర‌భాస్‌.. మ‌రొక‌రు క‌ట్ట‌ప్ప స‌త్యరాజ్‌.. మ‌రొక‌రు సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆయితే నిన్న కట్తప్ప స్వయంగా తాను బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పేసాడు...

ఒక్క పురుగుని

ఒక్క పురుగుని

ఒక్క పురుగుని కూడా లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య బాహుబలి ద కంక్లూజన్ లోని కీలక ఘట్టాలను చిత్రీకరించాడు రాజమౌళి ప‌క‌డ్బందీగా షూట్ చెయ్య‌డంతో దానిపై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే కాన్సెప్ట్ అయితే ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్టర్ అయిందో చూశాం..

ఈ ప్రశ్నకు సమాధానం

ఈ ప్రశ్నకు సమాధానం

ఈ ప్రశ్నకు సమాధానం కోసమే చాలామంది ‘బాహుబలి-2' కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలియకుండా, బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకూడా ఇదే విషయం మీద కట్టప్ప నే (సత్యరాజ్) స్వయంగా ఒక బాబు పేల్చాడు.... ఇందుకే నేను బాహుబలిని చంపాను అంటూ ఒక చమత్కారమైన ఆన్సర్ ఇచ్చి అందర్నీ నవ్వించాడు....

'కేవలం తమిళనాడులో తప్పించి

'కేవలం తమిళనాడులో తప్పించి

'కేవలం తమిళనాడులో తప్పించి.. అన్ని ఊళ్ళలోనూ నా పేరు కట్టప్పే. నాకు ఈ పాత్రను ఇచ్చి చాలా పెద్ద సత్కారం చేశారు నిర్మాతలు.. రాజమౌళి.. అలాగే అందరూ'' అంటూ ఆనంపడ్డాడు సత్యరాజ్. రెండేళ్ళుగా దేశం మొత్తాన్నీ ఊపేస్తున్న ప్రశ్నకు సమాధానం తెలిసిన కొందరిలో సత్యరాజ్ ఒకడు.

నిన్న జరిగిన బహుబలి

నిన్న జరిగిన బహుబలి

నిన్న జరిగిన బహుబలి: ది కంక్లూజన్ ప్రే రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు ఈ సందర్భంగా అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నా అంటూ ఆయన వేసిన జోక్ కి వచ్చినవాళ్ళంతా పడీ పడీ నవ్వారు... అప్పటిదాకా కాస్త సీరియస్ గా జరిగిన సభ ఒక్కసారి కేరింతలతో దద్దరిల్లిపోయింది.

బాహుబలిని ఎందుకు చంపానంటే..

బాహుబలిని ఎందుకు చంపానంటే..

''బాహుబలిని ఎందుకు చంపానంటే.. ప్రొడ్యూసర్ బాగా డబ్బులిచ్చాడు.. రాజమౌళి చెప్పాడు.. అందుకే చంపేశాను. లేకపోతే నా డార్లింగ్ ప్రభాస్ ను ఎందుకు చంపుకుంటాను? మిర్చి నుండి మా మధ్యన అనుబంధం ఉంటే'' అంటూ ఛమత్కరించాడు సత్య రాజ్. నిజంగానే బాహుబలి సినిమాకు కట్టప్ప క్యారక్టర్ చాలా కీలకమైంది.

కేవలం కట్టప్ప

కేవలం కట్టప్ప

కేవలం కట్టప్ప బాహుబలిని చంపటానికి కారణం ఏమిటీ అన్న ఒకే ఒక ప్రశ్న మీదే ఇప్పుడు బాహుబలి చేయబోయే 1000 కోట్ల వ్యాపారం ఆధారపడి ఉంది అంటే అతిసయోక్తి కాదు. అందుకే ఆయనకు అంత పేరు వచ్చింది. అయితే రెండో పార్టులో కూడా కట్టప్ప చేసిన రోల్ అంతకంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది అంటూ చెప్పాడు.

English summary
Satyaraj Who played kattappa role in Sensational movie Bahubali is Revealed the secreat behind "Why Kattappa killed Bahubali"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu