twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మపై తెలుగులో సెటైర్ సినిమా

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సెటైర్ చేస్తున్న విధంగా తెలుగులో కంపెనీ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఆ నిర్మాతలు ఆ విషయం డైరక్ట్ గా చెప్పకపోనప్పటికీ..వారి కధలో ప్రధానపాత్ర రామ్ భూపాల్ వర్మ తీసిన ఓ చిత్రం ఆదారంగా తమ కధ జరుగుతుందని ప్రకిటంచారు. ఇక వారి మాటల్లోనే చూస్తే...ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా నిలిచిన ఓ స్కాం నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం కంపెనీ . రమాశ్రీ క్రియేషన్స్ పతాకంపై వీరు.కె దర్శకత్వంలో లక్కరాజు రాధారాజేశ్వరి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ కథ, కథనం ఈ సినిమాకు హైలైట్.

    తెలుగు, తమిళ, మలయాళ, బోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం రూపొందించాం. ఈ నెల 10న పాటలను, దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. జైల్లో ఉన్న మద్దెలదరువు నూరి, బెయిల్లో తిరిగే కె.చియాన్, పరారీలో ఉన్న బాలుకిరణ్ అనే మూడు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది రాంభూపాల్ శర్మ అనే దర్శకుడు తీసిన చిత్రం ఆధారంగా నూరి హత్య ఎలా జరిగిందనే అంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని దర్శకుడు వీరు.కె చెప్పారు. మురళీకృష్ణ, స్వాతివర్మ, సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పత్తిపాటి ప్రసాద్.

    English summary
    "Company" is based on Suri Murder Mystery says director Veeru K.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X