వర్మపై సెటైర్ గా ‘పంజా’నిర్మాతల చిత్రం
పవన్‌కళ్యాణ్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో 'పంజా' చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్రా ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో మూడు చిత్రాలు మొదలుకానున్నాయి. వాటిలో రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ గా తీస్తున్న చిత్రం ఒకటి ఉందని తెలుస్తోంది. ఆ చిత్రం పేరు 'ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిలిం-నా సినిమా నా ఇష్టం'. ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ విషయాలను నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేశ్ ముంతా మంగళవారం ఒక ప్రకటనలో మీడియాకు తెలియచేసారు.
వారు తీస్తున్న మూడు చిత్రాలు టైటిల్స్ .. అలియాస్ జానకి, ఏ శ్యామ్ గోపాల్‌వర్మ ఫిలిం - నా సినిమా నా ఇష్టం, అరెరే... అరెరే... ఈ చిత్రాల పేర్లు. త్వరలో ఈ చిత్రాలు ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు. వారు మీడియాతో...''కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా, తెలుగు చిత్రపరిశ్రమలో ఎదగాలనుకొని ఉవ్విళ్లూరుతున్న ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఈ చిత్రాలను నిర్మిస్తున్నాం. ఈ చిత్రాల ద్వారా పలువురు సాంకేతికనిపుణులు, నటీనటులు పరిచయం కానున్నారు. ఓ వైపు కొత్తవారితో సినిమాలు చేస్తూ... మరోవైపు భారీ చిత్రాలను కూడా నిర్మిస్తాం. 'అలియాస్ జానకి' చిత్రానికి 'టెన్త్‌క్లాస్' ఫేం చందు దర్శకత్వం వహిస్తారు. రెండవ చిత్రమైన 'ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిలిం-నా సినిమా నా ఇష్టం' కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుంది. ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మూడో సినిమా 'అరెరే... అరెరే'. శేఖర్‌కమ్ముల శిష్యుడు శశికిరణ్ టిక్కాను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











