' బలుపు'లో బాలకృష్ణ ని ఉద్దేశించేనా...ఆ డైలాగు?
హైదరాబాద్: ఈ రోజు విడుదలైన రవితేజ తాజా చిత్రం 'బలుపు' లో బాలకృష్ణ డైలాగ్ డెలవరిని అనుకరిస్తూ...రవితేజ డైలాగ్స్ చెప్పటం పెట్టారు. రవితేజని సెకండ్ హీరోయిన్ అంజలి...తమ హాస్పటిల్ లో రోగులను ఉద్దేశించి స్పీచ్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రవితేజ..పదానికి పదానికి లింక్ లేకుండా..బాలకృష్ణ వాయిస్ ని అనుకరిస్తూ డైలాగ్ చెప్తారు. ఈ డైలాగ్ కు థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణకూ,రవితేజకు పడదనే టాక్ మొదటినుంచి ఉంది..దాన్ని నిజం చేస్తూ ఈ డైలాగ్ చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు.
సినిమా చూసిన వారి అభిప్రాయాలను పరిశీలిస్తే......రవితేజ గత సినిమాలతో పోలిస్తే 'బలుపు' చిత్రం సంతృప్తి కరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. కథ కొత్తదనం లేకపోయినా, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా...కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే రవితేజ కెరీర్‌ను 'బలుపు' మూవీ మళ్లీ గాడిలో పెట్టినట్లే కనిపిస్తోంది.
అయితే తొలి రోజు గడిస్తే గానీ అన్నివర్గాల ప్రేక్షకుల అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశం లేదు. మరి ఇది నిజంగానే రవితేకు బలుపా? లేక వాపా? అనేది రేపటిలోగా తేలనుంది. ఈ చిత్రంలో రవితేజ పేరు బలుపు శంకర్. పాత్ర తీరుకి తగ్గట్టుగా ఈ పేరును పెట్టారు. ప్రేమికురాలికి ఇచ్చిన మాట కోసం హీరో ఏం చేశాడు? వాటి వల్ల ఎదురైన పరిణామాలు ఏమిటన్నది కథలో కీలకాంశం. పక్కా మాస్ మసాలా చిత్రమిదని, ప్రేక్షకులు రవితేజ నుంచి వినోదాన్ని... అదే స్థాయి యాక్షన్ అంశాలూ ఆశిస్తారు. వాటికి తగ్గ విధంగా బలుపు చిత్రాన్ని తీర్చిదిదమని మేకర్స్ చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











