twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూర్ణేశ్ సినిమాలో కత్తి మహేశ్‌పై సెటైర్.. కావాలనే చేశారా.?

    |

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కుస్తీ పడుతూనే ఉన్నారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు.

    పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది యూనిట్.

    ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ రికార్డ్ నెలకొల్పిన డైలాగ్‌ను ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో చూపించారు. ఇది 3.27 నిమిషాల నిడివితో ఉంది. ఈ డైలాగుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

    ఈ ట్రైలర్‌లో సంపూర్ణశ్ బాబు నట విశ్వరూపం చూపించాడు. మూడు పాత్రల పరిచయంతో మొదలైన ట్రైలర్.. సంపూ బీభత్సంతో ముగుస్తుంది. అలాగే, అప్పట్లో బ్రహ్మానందం ఎలా ఉండేవారో అలాంటి గెటప్‌లో ఉన్న కత్తి మహేశ్ ఫొటో పట్టుకుని షకీలా ఏడుస్తూ కనిపిస్తుంది. అది చూసిన జడ్జ్ ఫొటోలో ఉన్నది మీ ఆయనా అని అడుగుతాడు. ఆమె అవును అంటుంది.

    Satire On Mahesh Kathi In Kobbari Matta Movie

    ఎందుకు ఏడుస్తున్నావు..? మీ ఆయన చనిపోయాడా అని మరో ప్రశ్న వేస్తాడు. దీనికి షకీలా.. 'అయ్యే లేదండీ.. ఆయన ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహీష్కరణ చేశారు' అని చెబుతుంది. వాస్తవానికి గతంలో కత్తికి ఇలాంటి అనుభవమే ఎదురవడంతో ఈ సీన్ కావాలనే ప్రస్తావించారన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    Tollywood Film Critic Mahesh Kathi recently posted Sensational Comments On cine, political persons. at the same time he post reviews also. now He share Kobbari Matta Trailer in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X