మెగా వర్సెస్ నందమూరి 'వార్':'ఒక్క క్షణం'లో బాలయ్యను కించపరిచారా?..
తెలుగు సినిమా పరిశ్రమలో డామినేషన్ ఎవరిదంటే.. ఆ రెండు సామాజిక వర్గాలదే అన్న సమాధానం టక్కున వచ్చేస్తుంది. అందులోనూ.. ఈ రెండు వర్గాలకు ఒకరంటే ఒకరు ఏమాత్రం పొసగని పరిస్థితి.
మెగా-నందమూరి అభిమానుల రూపంలో విడిపోయిన ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే సినిమాల రూపంలోనూ ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకుని ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజా విమర్శలకు కారణమేంటంటే..

ఒక్క క్షణంలో బాలయపై..:
తాజాగా విడుదలైన అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాలో బాలయ్యపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారన్న అభిప్రాయాలు ఈ విమర్శలకు తావిస్తున్నాయి. సినిమాలో చమ్మక్ చంద్ర నటించిన ఓ సన్నివేశాన్ని బాలయ్యను టార్గెట్ చేసుకునే తీశారన్న వాదన వినిపిస్తోంది.

ఏంటా సీన్?:
ఒక్క క్షణం సినిమాలోని ఓ సీన్‌లో చమ్మక్ చంద్ర ట్రాఫిక్ కానిస్టేబుల్ గా కనిపిస్తాడు. రోడ్డుపై డ్రంక్&డ్రైవ్ టెస్టులు చేస్తూ కొంతమందిని పట్టుకుంటాడు. ఇదే క్రమంలో తప్ప తాగి వచ్చిన ఓ వ్యక్తి 'ఐ హ్యవ్ 108ఫీవర్' అంటూ పైసా వసూల్ సినిమాలోని 'మామా.. ఏక్ పెగ్ లా..' పాటను అందుకునే ప్రయత్నం చేస్తాడు.

చితక్కొట్టి..:
అతనలా పాటందుకుంటుండగానే.. కానిస్టేబుల్ చమ్మక్ చంద్ర అతన్ని చితక్కొడుతాడు. పోలీస్ జీప్ ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇప్పుడిదే సీన్ పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. బాలయ్యను అవమానించడానికే ఈ సీన్ ఉద్దేశపూర్వకంగా పెట్టారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ:
గతంలోనూ మెగా-నందమూరి కుటుంబాల మధ్య సినిమా డైలాగ్స్ రూపంలో వార్ జరిగిన సంగతి తెలిసిందే. 'చరిత్రంటే మాది..' అని సింహా సినిమాలో బాలయ్య డైలాగ్ చెబితే.. 'చరిత్రలు చెత్తబుట్టల గురించి నేను పట్టించుకోను' అని గబ్బర్ సింగ్‌లో పవన్ కల్యాణ్ బాలయ్యపై పరోక్షంగా కౌంటర్ వేశారు.


Click it and Unblock the Notifications











