‘ఇజం’పై సెటైర్లు: బూతులు వెతికేవాళ్లంటూ పవన్ పంచ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖ సభలో రాజకీయాలపై తన ఆలోచన విధానాలను 'ఇజం' పుస్తకం రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పుసక్తం విడుదలైన తర్వాత దీనిపై పలువురు పలురకాలుగా స్పందించారు. పవన్ 'ఇజం' అర్థం కావడం లేదని, గందగోళంగా ఉందని కొందరు విమర్శించారు కూడా.
'ఇజం' పుస్తకంపై వస్తున్న ఇలాంటి విమర్శలను పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. 'రామాయణంలో కూడా బూతులు వెతికే వాళ్లకు తన ఆలోచనలతో కూడిన 'ఇజం' పుస్తకం ఎలా అర్థమవుతుంది' అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తీరును పరిశీలిస్తే......ప్రత్యర్థి రాజకీయ నాయకుల నుండి వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ఆయన అన్ని విధాలా సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.

రాజకీయాల సంగతి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా జీవితానికి సంబంధించిన విశేషాల్లోకి వెళితే...
ఇటీవల ఓ పత్రిక ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'గతంలో తాను సంవత్సరానికి 100 రోజులు సినిమాల కోసం పని చేసే వాన్ని. ఇపుడు జన సేన పార్టీకి సంబంధించిన పనులు కూడా చూసుకోవాలి. గతంలోలా కాక పోయినా....సంవత్సరానికి 50 రోజులు సినిమాల కోసం కేటాయిస్తాను' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన సినిమాల్లో కొనసాగుతారని స్పష్టమవుతోంది.
సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇక షూటింగులకు 50 కోజులు మాత్రమే కేటాయిస్తాననే ఆయన నిర్ణయం నేపథ్యంలో.........ఆయన సినిమా సినిమాకు గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతాననే సంకేతాలు ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' చిత్రం తో పాటు, హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈచిత్రాల విడుదల ఆలస్యం అవయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications