twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాకి సెన్సార్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు

    By Srikanya
    |

    న్యూఢిల్లీ : రీసెంట్ గా ప్రతీ చిత్రం వివాదం అవుతూండటంతో సెన్సార్ బోర్డ్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈ గొడవ ఒక్క తెలుగుకే కాక మొత్తం అన్ని భాషల సినిమాల వారూ ఎదుర్కొంటున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌ నుంచి టాటాకంపెనీని వెళ్లగొట్టిన టిఎంసి చీఫ్‌... మమతాబెనర్జీపై వ్యంగ్యంగా తీసినచిత్రానికి అనుమతి ఇచ్చేందుకు సెన్సార్‌ బోర్డు నిరాకరించింది.

    ఈ చిత్రం పేరు 'కంగల్‌ మల్సాట్‌' . ఈ చిత్రానికి సుమన్‌ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించారు. మహాశ్వేతాదేవి కుమారుడు నబరూన్‌ భట్టాచార్య రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. మమత సిఎంగా ప్రమాణం చేసిన దృశ్యాలను వ్యంగ్యంగా చిత్రీకరించారు. ఇది బెంగాలీల సెంటిమెంట్లనుగాయపరచవచ్చని సెన్సార్‌ బోర్డు చిత్ర నిర్మాతలకు రాసిన లేఖలో తెలిపింది. అందువల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది.

    ఇక రీసెంట్ గానే.. సెన్సార్ బోర్డు తీరుపై 'జబర్‌దస్త్' చిత్ర దర్శకురాలు నందినీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నందినీరెడ్డి మాట్లాడుతూ...'విశ్వరూపం' చిత్రం కాంట్రవర్సీ తర్వాత సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ 'అల్లా అల్లా' పదంలో ముస్లింలను కించ పరిచే విధంగా ఏముందో నాకు అర్థం కావడం లేదు. సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయాల వల్ల సినిమా స్వేచ్ఛ హరించ బడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ప్రపంచం చీకటి యుగాలకు వెలుతుంది.' అని ఆమె అభిప్రాయ పడ్డారు.

    'అదే విధంగా సినిమాలో చాలా డైలాగులను తొలగించారు. సెన్సార్ బోర్డు తీరు మరీ దారుణంగా ఉంది. సినిమాలు ఎలా తీయాలో, ఎలాంటి పదాలు వాడకూడదో, ఎలాంటి పదాలు వాడాలో స్పష్టం వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు వారు ఓ టెక్ట్స్ బుక్ రిలీజ్ చేస్తే బాగుటుంది' అంటూ నందినీరెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేగాక ఈ మధ్యన ఓ దర్శకుడు సెన్సార్ బోర్డ్ ఎదురుగా ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు.

    English summary
    The regional body of the Central Board of Film Certification has refused to pass Kangal Malsat, a Bengali film by filmmaker Suman Mukhopadhyay. The letter of refusal cites unnecessary use of abusive language, sexuality, a casual approach to portraying social movements that may hurt sentiments and a distortion of history. But Suman Mukhopadhyay says this is a dangerous trend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X