కమెడియన్స్ హీరోలుగా ప్రమోట్ అవుతున్న సీజన్ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నడుస్తోంది.ఈ ట్రెండుని అనుసరిస్తూ 'సత్యం' రాజేష్ ని హీరోగా పరిచయం చేస్తూ 'సత్తిగాడి పెళ్లి'... అయినప్పుడు చూద్దాం అనే పేరుతో ఒక సినిమా ప్రారంభం కాబోతోంది.నెల క్రిందట వేణు మాధవ్ హీరోగా 'ప్రేమాభిషేకం', రెండు వారాల క్రితం కృష్ణ భగవాన్ హీరోగా 'జాన్ అప్పారావు 40 ప్లస్' విడుదలై నెగిటివ్ ఫలితాన్ని చూసాయి. అలాగే దువ్వాసి మోహన్ హీరోగా 'కుర్ కురే', 'దొంగ సచ్చినోళ్ళు' సినిమాతో రఘు బాబు, గౌతంరాజు హీరోగా 'పరమానందయ్య స్టూడెంట్స్', బ్రహ్మానందం హీరోగా 'ఆప్త బంధువు', సునీల్ 'బంతి' లైనులో ఉన్నాయి. పాపులర్ కమెడియన్స్ కి ఆల్రెడీ కొంత క్రేజ్ ఉంటుంది. శాటిలైటు మార్కెట్ కి ఇబ్బంది ఉండదు. అలాగే బడ్జెట్ కూడా పెద్దగా ఉండదు. మినిమంలో లాగించెయ్యచ్చు. మినిమం ఓపినింగ్స్ ఉంటాయి. దాంతో పెద్ద హీరోల డేట్స్ దొరకని చాలా మంది నిర్మాతలు ఈ తరహా చిత్రాలు తీయటానిక రెడీ అవుతున్నారు. కాని రిజల్ట్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. దానికి కారణం నిర్మాణాన్ని నిబద్దతతో తీసుకోకుండా కామెడీగా చుట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కామెడీగా ప్లాపులు అంటున్నారు సీనియర్లు. కరెక్టే కదా. సరిగా ఈ అవకాశాలని వినియోగించుకుంటే యమలీల, అందాల రాముడు వంటి హిట్లు వస్తాయి. లేకుంటే 'కామెడీ సినిమా ఆడినప్పుడు చూద్దాం' అనుకోవాల్సి వస్తుంది.