Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బ్లఫ్ మాస్టర్.. నాలుగు గోడల మధ్య రాసిన కథ కాదు.. సమాజంలో వాస్తవం!
ఎవరో నలుగురు రచయితలు నాలుగు గోడల మధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన కథ కాదు ఇది . మన నాలుగు దిక్కులా ఎల్లవేళలా జరుగుతున్న నిజం. ఆ వాస్తవాలను కథగా మలచి మేం బ్లఫ్ మాస్టర్‌ను తెరకెక్కించాం అని అంటున్నారు గోపీ గణేష్ పట్టాభి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాత. తమిళంలో ఘనవిజయం సాధించిన చతురంగ వేట్టైని ఆధారంగా చేసుకుని తెలుగులో బ్లఫ్ మాస్టర్రూపొందింది. జ్యోతిలక్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు .ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక.
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ కొందరు కరక్కాయలు అని, ఇంకొందరు ఇరిడియం అని, మరి కొందరు ఎం.ఎల్.ఎం అని... నిత్యం మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి మాయమాటలను నిజమని నమ్మడం.. మోసపోవడం.. తీరా మోసపోయాక.. మోసపోయాన్రా అని నలుగురికి చెప్పుకోవడం... ఈ సమాజంలో ఫ్యాషనైపోయింది. అందుకే దాన్నే కథా వస్తువుగా తీసుకుని, ప్రతిరూపంగా సినిమాగా తెరకెక్కించాం. ఇందులో ఘరానా మోసగాడుగా సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకుల అభినందనలు పొందడానికి తన శక్తిమేర ప్రయత్నించాడు అని అన్నారు.
చిత్ర నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది . షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పాటలను విడుదల చేస్తాం. నవంబర్‌లో చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్,
నందిత
శ్వేతా,
పృథ్వి,
బ్రహ్మాజీ,
ఆదిత్యామీనన్,
సిజ్జు,
చైతన్య
కృష్ణ,
జబర్దస్త్
మహేష్,
ధన్‌రాజ్,
వేణుగోపాలరావు,
ఫిష్
వెంకట్,
బన్నీ
చందు,
దిల్
రమేష్
తదితరులు.
సాంకేతిక
నిపుణులు
:
కథ:
హెచ్.డి.వినోద్,
అడిషనల్
డైలాగ్స్:
పులగం
చిన్నారాయణ,
సంగీతం:
సునీల్
కాశ్యప్,
ఎడిటర్:
నవీన్
నూలి,
ఆర్ట్:
బ్రహ్మ
కడలి,
కెమెరా:
దాశరధి
శివేంద్ర,
కో
డైరక్టర్:
కృష్ణకిశోర్,
ప్రొడక్షన్
కంట్రోలర్స్:
ఆర్.సెంథిల్,
కృష్ణకుమార్,
సమర్పణ:
శివలెంక
కృష్ణ
ప్రసాద్,
నిర్మాత:
రమేష్
పిళ్లై,
మాటలు
-దర్శకత్వం:
గోపీగణేష్
పట్టాభి