twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రగులుతున్న వివాదం, నిరూపించి మాట్లాడు: పోసాని పై సత్యారెడ్డి ఆగ్రహం

    అవార్డుల గురించి పోసాని అన్న మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్నామని.. సత్యారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    |

    Recommended Video

    రగులుతున్న వివాదం.. పోసాని పై సత్యారెడ్డి ఆగ్రహం

    నంది అవార్డుల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు అవార్డులు ప్రకటించినప్పటినుంచీ ఏదో ఒక విమర్శవస్తూనే ఉంది. అయితే ప్రముఖుల్లో అందరి స్పందన వేరూ పోసాని కృష్ణమురళి ఇచ్చిన స్పందన వేరు... ఆయన సహజ శైలి లో కాస్త ఘాటుగానే తన అభిప్రాయం చెప్పాడు. అయితే ఈ వ్యవహారం కాస్తా పోసాని సొంత వ్యవహారం అయ్యింది.. ఇప్పుడు నంది గొడవ మొత్తం పోసాని మెడకు చుట్టుకునేలాఉంది...

    మంత్రి లోకేష్‌బాబు

    మంత్రి లోకేష్‌బాబు

    ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి లోకేష్‌బాబు స్పందించిన తీరుపై సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. మంత్రి లోకేశ్ బాబు చెప్పిన ప్రకారం నంది అవార్డులపై విమర్శలు చేస్తున్న వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్ర (ఎన్ఆర్‌ఏ)లే.

    నంది అవార్డులపై విమర్శలు

    నంది అవార్డులపై విమర్శలు

    వారికి ఆంధ్రలో ఆధార్ కార్డులు లేవు. అలాంటి వారే నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను పోసాని తప్పుపట్టారు. అసలు నంది అవార్డులని రద్దు చేస్తామనటానికి నువ్వెవరు? అన్న స్థాయిలో విరుచుకు పడ్డ పోసాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది...

     రోహింగ్యాలం అయ్యాం

    రోహింగ్యాలం అయ్యాం

    తెలుగు ప్రజలు, ప్రభుత్వం చాలా మంచివారని. ఎన్నడూ ఆంధ్రప్రాంతవాసులను ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. మంత్రి లోకేష్ బాబు మాటలను బట్టి చూస్తే విభజన తర్వాత అటు ఆంధ్రాకు ఇటు తెలంగాణాకు కాకుండా తెలుగు రోహింగ్యాలం అయ్యాం. అంటూ అంతర్జాతీయ రాజకీయాలకు ముడిపెట్టి మరీ విరుచుకు పడ్డాడు...

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాధపడే విధంగా

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాధపడే విధంగా

    నంది అవార్డులపై ప్రశ్నిస్తే అసలు నంది అవార్డులు రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్లుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో.. ఇటు తెలుగు సినీ పరిశ్రమ అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాధపడే విధంగా పోసాని మాట్లాడారని నిర్మాత సత్యారెడ్డి, పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

     అవార్డల గురించి ప్రశ్నిస్తే

    అవార్డల గురించి ప్రశ్నిస్తే

    అసలు పోసానిగారు మాట్లాడిన ఆరోపణల్లో 10 ఆరోపణలు అవాస్తవాలని ఆయన అన్నారు. అందులోని మొదటి ఆరోపణ అవార్డల గురించి ప్రశ్నిస్తే.. నంది అవార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని పోసాని అన్నారు. కానీ అలా ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నారో నిరూపించాలి.

    లోకేష్ బాబు

    లోకేష్ బాబు

    అలాగే దీనికి ఏపీ ఐటి శాఖామాత్యులు లోకేష్ బాబుగారికి ఏమి సంబంధమో చెప్పాలి. 1998లో నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇలానే నంది అవార్డులు తప్పు అని ఇదే పోసాని గారు, గుణశేఖర్‌గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆనాడు వార్తాపత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూడవచ్చని సత్యారెడ్డి అన్నారు.

    అయన విజ్ఞతకే వదిలేస్తున్నాం

    అయన విజ్ఞతకే వదిలేస్తున్నాం

    అలాగే ఏపీ ప్రభుత్వం చేసే మంచి పనులను పక్కన పెట్టేసి పోసానిగారు ఇలా నంది అవార్డుల గురించి మాట్లాడడం, అలాగే లోకేష్‌గారి గురించి మాట్లాడిన మాటలు గాని, కులాలకు సంబంధించిన మాటలుగాని, ఒక పార్టీ ఎమ్మెల్సీ గురించి మాట్లాడిన మాటలు, బిఎన్ రెడ్డి అవార్డుపై బోయపాటిగారిని అన్నమాటలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి కి వచ్చిన అవార్డుల గురించి పోసాని అన్న మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్నామని.. సత్యారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    ఒక కులానికి అంటగట్టవద్దు

    ఒక కులానికి అంటగట్టవద్దు

    అప్పట్లోనే పోసాని నంది అవార్డులను రద్దు చేయాలని.. నంది అవార్డులను కించపరిచేలా మాట్లాడారు. అలాగే ఈ అవార్డులను ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి అంటగట్టవద్దని సత్యారెడ్డి అన్నారు. ఈ అవార్డుల సంగతేమో గానీ మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్యా పెద్ద వివాదమే అయ్యేలా కనిపిస్తోంది..

    English summary
    Producer Satya Reddy serious reply to Posani Krishnamurali comments on Nandi Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X