ఆఫ్ఘనిస్తాన్‌లో అరెస్ట్.. అలా చేయడంతో అనుమానం.. చేదు ఘటనపై సత్యదేవ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఏ క్యారెక్టర్ అయినా పోషించగల సత్తా ఉన్న నటుడు సత్య దేవ్. ఈ లాక్ డౌన్‌లో తెలుగు ప్రేక్షకులను ఎక్కువ సార్లు పలకరించాడు. సత్య దేవ్ నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లో ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యాయి.మంచి పేరు కూడా వచ్చింది. తాజాగా సత్యదేవ్ అలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్ అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా వివరించాడు.

అలా అన్నాడు..
సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క వ్యక్తి తెలుసు. అతని దగ్గరికి వచ్చి హీరో అవుదామని అనుకుంటున్నాను అని చెప్పాను. వాటికి పనికి రావు అంటూ అలా నిరుత్సాహపరిచాడు అంటూ సత్య దేవ్ అసలు సంగతి వివరించాడు. అలా అన్నాడనే ఇలా కసి పెరిగి ఇక్కడి వరకు వచ్చి ఉంటావని అలీ సరదాగా కామెంట్ చేశాడు.

హీరోగా అలా..
జ్యోతి లక్ష్మీ సినిమాతో సత్యదేవ్ హీరోగా మారాడన్న సంగతి తెలిసిందే. అప్పటికే దాదాపు వెయ్యి మందిని ఆడిషన్స్ చేశారట. ఇక ఒక రోజు పూరి జగన్నాద్ పిలిచి నువ్వేనయ్య హీరో అంటూ చెప్పేశాడట. ఆ నిమిషంలో సత్యదేవ్‌కు ఎంతో సంతోషమేసిందట.

వన్ డే జాబ్..
పై బటన్ పెట్టుకునే అలవాటు లేదు. అలా ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లాను .అదే మొదటి రోజు. ఆ రోజే సీఈవో వచ్చి బటన్ పెట్టు అన్నాడు. కాస్త ఎక్కువగా మాట్లాడాడు. లంచ్‌కు వెళ్లొస్తా అని చెప్పాను అలా ఏడేళ్లు అయింది ఇంకా వెళ్లలేదు అని గతంలో జరిగిన ఓ సంఘటన గురించి సత్య దేవ్ చెప్పాడు.
Recommended Video

ఆఫ్ఘనిస్తాన్‌లో అరెస్ట్..
ఆఫ్ఘనిస్తాన్‌లో అరెస్ట్ చేశారట ఎందుకు చేశారు? వేషం చూసి చేశారా? భాష అర్థం కాక చేశారా? అంటూ అలీ ప్రశ్నించాడు. ఓ స్ట్రీట్‌లో అలా వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటే సూసైడ్ బాంబర్స్ అనుకుని అరెస్ట్ చేశారట. హిందుస్తాన్ అని అన్నా కూడా వినలేదుట. హిందీ సినిమా షూటింగ్ కోసం కాబూల్ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందట. దాదాపు 40 రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్ చేశారట.


Click it and Unblock the Notifications











