GODSE Twitter Review: ఆ సినిమాలు గుర్తొచ్చేలా ‘గాడ్సే’.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఓవరాల్ టాక్ ఏంటంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన వారిలో సత్యదేవ్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి సోలో హీరోగా మారిన అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గాడ్సే' అనే సందేశాత్మక చిత్రంతో వచ్చేశాడు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో ఓ లుక్కేద్దాం పదండి!

గాడ్సేగా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్

గాడ్సేగా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్

సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రమే 'గాడ్సే'. ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

రాజకీయ వ్యవస్థపై పోరాటంతోనే

రాజకీయ వ్యవస్థపై పోరాటంతోనే

ఎప్పటికప్పుడు వినూత్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో కనిపించే సత్యదేవ్ ఇప్పుడు 'గాడ్సే' అనే సినిమాను చేశాడు. దీన్ని భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటం నేపథ్యంతో తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

అంచనాలకు తగ్గట్లే ప్రీ బిజినెస్

అంచనాలకు తగ్గట్లే ప్రీ బిజినెస్

సత్యదేవ్‌ మార్కెట్‌కు, అంచనాలకు తగ్గట్లుగానే 'గాడ్సే' బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌‌తో పాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 4.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

‘గాడ్సే’ మూవీకి అలాంటి టాక్

‘గాడ్సే’ మూవీకి అలాంటి టాక్

విలక్షణ నటుడు సత్యదేవ్ - ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గాడ్సే' మూవీ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా పర్వాలేదనేలా ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

సత్యదేవ్ నటించిన 'గాడ్సే' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం చాలా మంది ప్రముఖులను హీరో అంతమొందించే సన్నివేశాలతో ఆసక్తికరంగా చూపించారట. ఇందులో ఇంటర్వెల్ మరింత హైలైట్‌గా ఉంటుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం గత సినిమాలను గుర్తు చేసే సన్నివేశాలతో సాగుతుందట. క్లైమాక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉందని తెలిసింది.

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇలా

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇలా


'గాడ్సే' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో సత్యదేవ్ వన్ మ్యాన్ షో చేశాడట. మరీ ముఖ్యంగా అతడు పలికే డైలాగులు తూటాల్లా పేలాయని అంటున్నారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం దీనికి మైనస్‌గా మారాయని టాక్.

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే!

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే!

ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. 'గాడ్సే' మూవీలో దర్శకుడి బలమైన ఆలోచనను ప్రేక్షకులకు సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం కనిపించిందట. అయితే, గతంలో 'భారతీయుడు', 'జెంటిల్‌మన్' వంటి చిత్రాల మాదిరిగా ఉండడంతో ఇందులో కొత్తదనం లోపించిందని అంటున్నారు. కానీ, సత్యదేవ్ నటన, డైలాగ్స్ కోసం దీన్ని చూసేయొచ్చట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X