twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thimmarusu Twitter Review: సత్యదేవ్ ఖాతాలో మరొకటి.. ఏ సినిమాలో లేనన్ని.. ఇంతకీ ఎలా ఉందంటే!

    |

    కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడింది. గత ఏడాది, ఈ సంవత్సరం లాక్‌డౌన్‌లు పెట్టడం వల్ల సినిమా షూటింగ్‌లు, విడుదలలు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు (జూలై 30) నుంచి థియేటర్ల గేట్లు తెరుచుకోబోతున్నాయి. నేడు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన 'తిమ్మరసు' ఒకటి. ఇప్పటికే యూఎస్‌లో ప్రదర్శితం అయిన ఈ సినిమాపై ప్రేక్షకులు ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ రివ్యూ మీకోసం!

     ‘తిమ్మరసు'గా వస్తున్న విలక్షణ హీరో

    ‘తిమ్మరసు'గా వస్తున్న విలక్షణ హీరో

    విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అతడు నటించిన చిత్రమే 'తిమ్మరసు'. ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బీర్బల్'‌కు ఇది రీమేక్‌గా వచ్చింది.

    మోక్షజ్ఞ ఎంట్రీపై అదిరిపోయే న్యూస్: ఆదిత్య 999 కంటే ముందే.. పరిచయం చేయనున్న స్టార్ డైరెక్టర్మోక్షజ్ఞ ఎంట్రీపై అదిరిపోయే న్యూస్: ఆదిత్య 999 కంటే ముందే.. పరిచయం చేయనున్న స్టార్ డైరెక్టర్

    ఇద్దరు స్టార్ హీరోలు ఎంట్రీతో భారీగా

    ఇద్దరు స్టార్ హీరోలు ఎంట్రీతో భారీగా

    సత్యదేవ్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉంటాయి. అలాంటిది 'తిమ్మరసు' చిత్రానికి స్టార్ హీరోలు ప్రమోషన్ చేయడం మరింత ప్లస్ అయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేశాడు. అలాగే, నేచురల్ స్టార్ నాని ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు. వీళ్ల వల్ల ఈ సినిమాకు చాలా కలిసొచ్చింది. అందుకే భారీ స్థాయిలో విడుదలవుతోంది.

    యూఎస్‌లోనూ గ్రాండ్‌గానే విడుదల

    యూఎస్‌లోనూ గ్రాండ్‌గానే విడుదల

    థియేట్రికల్ ట్రైలర్‌తో అంచనాలు పెంచుకున్న 'తిమ్మరసు' మూవీ నైజాం ఏరియాలో దాదాపు 300 థియేటర్లలో విడుదల కాబోతుంది. మీడియం రేంజ్ సినిమాల మాదిరిగా దీనికి థియేటర్లు దక్కాయి. అలాగే, యూఎస్‌లోనూ దాదాపు 50 లొకేషన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. పాజిటివ్ టాక్ వస్తే మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

     ‘తిమ్మరసు'కు అక్కడ పాజిటివ్ టాక్

    ‘తిమ్మరసు'కు అక్కడ పాజిటివ్ టాక్

    యూఎస్‌లో ఇప్పటికే 'తిమ్మరసు' మూవీ ప్రీమియర్ షోలు పడిపోయాయని తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాకు అనూహ్యంగా భారీ స్థాయిలో స్పందన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ మూవీకి అన్ని లొకేషన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో తిమ్మరసుకు గ్రాండ్ ఓపెనింగ్ దక్కేలా ఉంది.

     ‘తిమ్మరసు' మూవీ ప్లస్, హైలైట్లు ఇవే

    ‘తిమ్మరసు' మూవీ ప్లస్, హైలైట్లు ఇవే

    'తిమ్మరసు' మూవీని చూసిన వారంతా ఇది ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు. ఇందులో సత్యదేవ్ నటన వన్ మ్యాన్ షోగా నిలిచిందని ప్రముఖంగా వెల్లడిస్తున్నారు. అలాగే, ఇందులో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతూనే ఉంటాయని అంటున్నారు. అలాగే, ఇంటర్వెల్, క్లైమాక్స్ పార్టులు సినిమాకు హైలైట్ అని కొనియాడుతున్నారు. అలాగే, యాక్షన్ కూడా బాగుందట.

    తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే: మహేశ్, బన్నీ రికార్డు.. పవన్‌కు దక్కని చోటుతెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే: మహేశ్, బన్నీ రికార్డు.. పవన్‌కు దక్కని చోటు

     ఆ కొన్ని సీన్స్ మాత్రమే మైనస్‌ అని

    ఆ కొన్ని సీన్స్ మాత్రమే మైనస్‌ అని

    ఓ పాత కేసును రీ ఓపెన్ చేయించి దాన్ని లాయర్ అయిన హీరో ఎలా పరిష్కరించాడన్న కాన్సెప్టుతో 'తిమ్మరసు' మూవీ రూపొందింది. ఈ సినిమా మొత్తం సూపర్‌గా ఉందని చెబుతున్న ప్రేక్షకులు కొన్ని సీన్స్ మాత్రం బోరింగ్‌గా ఉన్నాయని అంటున్నారు. అవి కట్ చేసినా నష్టం ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించే థ్రిల్లర్ అని చెబుతున్నారు.

     మొత్తంగా ఈ సినిమా ఎలా ఉందంటే

    మొత్తంగా ఈ సినిమా ఎలా ఉందంటే

    ఎన్నో అంచనాలు, ఆశలు నడుమ విడుదలైన 'తిమ్మరసు' మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరీ ముఖ్యంగా దీన్ని దర్శకుడు నడిపించిన తీరు హైలైట్ అని అంటున్నారు. అలాగే, శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందట. సత్యదేవ్‌తో పాటు బ్రహ్మాజీ, రవిబాబు, ఝాన్సీ, కొత్త కుర్రాడు అదరగొట్టేశారని చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసే మూవీ అని ఆడియెన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

    English summary
    Satyadev Kancharana Now Did a Film Thimmarusu Under Sharan Koppisetty Direction. This Movie Released Today. Twitter Review on this occasion is for you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X