Krishnamma Movie Twitter Review: సత్యదేవ్ మూవీకి అలాంటి టాక్.. కృష్ణమ్మ సినిమా ఎలా ఉందంటే!
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో సత్తా చాటుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సత్యదేవ్‌దే. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి సోలో హీరోగా మారిన అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కృష్ణమ్మ' అనే మాస్ మూవీతో వచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూను మీరే చూడండి!
కృష్ణమ్మ అంటూ వచ్చాడు
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రమే 'కృష్ణమ్మ'. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

అలాంటి స్టోరీతో రంజుగా
సంతోషంగా బతుకుతున్న ముగ్గురు స్నేహితుల డ్రీమ్స్‌ను చెడగొడితే.. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన సినిమానే 'కృష్ణమ్మ'. విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం కాదు అని చెప్పేలా దీన్ని రూపొందించారు. దీనికితోడు ఇందులో సత్యదేవ్ హీరోగా నటించడంతో ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇప్పటికే షోలన్నీ కంప్లీట్
విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చెప్పొచ్చు.
మంచి స్టోరీ టెల్లింగ్ మూవీ
సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో తన అభిప్రాయం చెప్పారు. 'తెలుగు సినిమాలో కథను చక్కగా చెప్పిన చిత్రాల్లో కృష్ణమ్మ ఒకటి. సత్యదేవ్ యాక్టింగ్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. గుండెకు హత్తుకునే నేపథ్యంతో ఇది సాగుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీల్లో ఇది ఒకటి' అని చెప్పుకొచ్చారు.
తప్పక నచ్చుతుందని
సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' మూవీని చూసిన మరో నెటిజన్ 'కృష్ణమ్మ సినిమా విజయం సాధించినందుకు దర్శకుడు గోపాలకృష్ణకు, హీరో సత్యదేవ్‌కు అభినందనలు. ఇది టాలీవుడ్‌లో వచ్చిన కొత్త తరహా సినిమా. ఆడియెన్స్‌కు కచ్చితంగా నచ్చుతుంది. ఇంత మంచి సినిమాను మా ముందుకు తెచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చారు.
ఓవరాల్‌గా అలాంటి టాక్
టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు అన్నీ కాస్త పాజిటివ్‌గానే ఉన్నాయి. అయితే, కొందరు మాత్రం ఈ మూవీ ఏవరేజ్‌గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ చిత్రానికి ట్విట్టర్‌లో డీసెంట్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు. మరి మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











