Polimera 2 Twitter Review: పొలిమేర 2 మూవీకి ఊహించని టాక్.. మొత్తం ఆ సీన్సే.. ఇంతకీ చూడొచ్చా అంటే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగులో చిత్ర విచిత్రమైన కాన్సెప్టులతో చిత్రాలు వస్తున్నాయి. అలా ఆ మధ్య వచ్చిన సినిమానే 'మా ఊరి పొలిమేర 1'. చేతబడుల నేపథ్యంతో సాగే కథతో రూపొందిన ఈ మూవీ ఓటీటీలోనే విడుదలైంది. దీనికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమేర 2'ను తెరకెక్కించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే స్వయంగా చూసేయండి మరి!
మరో యదార్థ కథతో పొలిమేర:సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 3న విడుదలైంది.

దానికి సీక్వెల్.. మళ్లీ అదే కథ:గతంలో ఓటీటీలో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న 'పొలిమేర' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిందే 'మా ఊరి పొలిమేర 2'. చేతబడులు చేసుకునే ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి చనిపోయినట్లు నమ్మించి ఆమెను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్న కథతో ఈ మూవీ తెరకెక్కింది.
సినిమా చాలా బాగుంది అని:'మా ఊరి పొలిమేర 2' మూవీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శితం అయింది. దీన్ని తాజాగా చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అందులో 'పొలిమేర 2లో డైరెక్షన్ అద్భుతంగా ఉంది. చాలా బాగా కథను నడిపించారు. అలాగే, ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఫైరింగ్‌గా ఉంది' అని రాసుకొచ్చారు.
ఫస్టాఫ్ అలా.. లింక్ చేశారు:సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమేర 2' సినిమాను వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో 'మా ఊరి పొలిమేర 2 మూవీలోని ఫస్టాఫ్ బాగుంది. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పార్ట్ 1కు పార్ట్ 2కు లింక్ చేసే సీన్స్ బాగున్నాయి. బోర్ కొట్టే సీన్స్ ఏమీ లేవు' అంటూ వివరించారు.
ట్విస్టులతోనే సెకెండాఫ్:ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. 'మా ఊరి పొలిమేర 2 కొన్ని ట్విస్టులతో చాలా బాగుంది. క్లైమాక్స్ కాస్త స్లోగానే ఉన్నా ట్విస్టు మాత్రం అదిరిపోయింది. ఇది కచ్చితంగా చూడదగ్గ చిత్రం. పొలిమేర 3 కోసం వేచి చూస్తున్నాము' అంటూ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
దాని కోసం వెయిటింగ్:'మా ఊరి పొలిమేర 2' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో 'మూడో పార్ట్ కోసం వెయిటింగ్.. పొలిమేర 2కు నా రేటింగ్ 2.7/5.. ఈ సినిమాలో ఫస్టాఫ్ పార్ట్ వన్‌ను మళ్లీ చూపిస్తూ.. కొత్త క్యారెక్టర్లను పరిచయం చేస్తూ సాగింది. ఇంటర్వెల్ బాగుంది. సెకెండాఫ్‌లో చిల్ మూమెంట్లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది. క్లైమాక్స్ పార్ట్ 3కి ఇంట్రోలా ఉంది' అని చెప్పుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో బెస్ట్:సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించారు. 'ఈ మధ్య కాలంలో బెస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాలోని ట్విస్టులు, మలుపులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే క్రేజీగా ఉంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా పొలిమేర 2' అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మొత్తంగా అలాంటి టాక్:క్రేజీ హిట్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బోర్ కొట్టే సీన్స్ కాకుండా మంచి సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని వీక్షకులు చెప్తున్నారు. ముఖ్యంగా ట్విస్టులు చాలా బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా ఈ చిత్రం అందరూ చూడొచ్చని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











