‘సత్యమేవ జయతే’లో సల్మాన్ ఖాన్ (ప్రోమో)
హైదరాబాద్: హీరోగానే కాకుండా ‘సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా అంతుకు మించిన ఇమేజ్ సొంతం చేసుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమీర్‌ఖాన్. ఇప్పటికే ‘సత్యమేవ జయతే' రెండు సీజన్లు విజయవంతం కావడంతో సత్యమేవ జయతే సీజన్-3 కూడా ప్రారంభించారు.
'సత్యమేవ జయతే' సీజన్-3లో నటుడు సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. త్వరలో ప్రసారం కానున్న ఓ ఎపిసోడ్ లో సల్మాన్ కనిపిస్తాడు. తాజాగా అందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. అందులో కార్యక్రమ సెట్స్ లో ఉన్న లైవ్ ఆడియన్స్ కు తన స్నేహితుడైన సల్లూను అమీర్ పరిచయం చేస్తాడు. దాంతో, ఒక్కసారిగా అక్కడివారంతా ఆశ్చర్యపోతారు. అమీర్, సల్మాన్ ఇద్దరూ నవ్వుకుంటూ ఆలింగనం చేసుకుంటారు. దానికి సంబంధించి ఎపిసోడ్ ఈ నెల 26న ప్రసారంకానుంది.

రెస్పాన్స్ అదిరిపోతోంది...
ఈ కార్యక్రమానికి రెస్పాన్స్ అదిరిపోతోంది. అటు ఆడియన్స్‌తో పాటు ఇటు మీడియా కూడా ఈ షోపై ఆసక్తి రేకెత్తిస్తోంది. తన సినిమా ‘పీకే' షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లినపుడు, సినిమా గురించి అక్కడ ఎవరూ అడగలేదని, ‘సత్యమేవ జయతే' గురించి అంతా అడుగుతున్నారని అమీర్ ఖాన్. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం స్టార్‌ప్లస్‌లో టెలికాస్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











