జూన్ 14న ' సత్యమేవ జయితే' ప్రారంభం

అలాగే ఇక కెరీర్ ముగిసిపోతోందనుకున్న దశలో చేసిన 'ఎవడైతే నాకేంటి' పోలీసులకు సపోర్టు ఇచ్చే హోం మినిస్టర్ పాత్ర. అదీ మంచి హిట్టైంది. రాజశేఖర్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను ఆయన భార్య జీవిత స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్నారు. దాంతో ఆయన 'సత్యమేవ జయతే' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా మొదలు కాక మునుపే ఇద్దరు నిర్మాతలు మారారు. అందుకే సొంత బానర్ అయిన ఆండాళ్ ఆర్ట్స్ కిందే ఈ సినిమాను రాజశేఖర్ దంపతులు నిర్మించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 14న ప్రారంభం కానున్నది. కాగా ఈ సినిమా ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టనున్నారు.


Click it and Unblock the Notifications











