twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్ : ప్రభాస్ 'బాహుబలి' లో సత్యరాజ్...డిటేల్స్

    By Srikanya
    |

    చెన్నై : తమిళ నటుడు సత్యరాజ్‌ తెలుగు చిత్రపరిశ్రమపై దృష్టిపెట్టాడు. తాజాగా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'బాహుబలి' కోసం ఆయన ఎంపికయ్యారు. 'కబ్బా' అనే పాత్రలో సత్యరాజ్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం గుర్రపుస్వారీ, కత్తిపోరాటాలపై శిక్షణ తీసుకుంటున్నారని తమిళ సిని వర్గాల సమాచారం.

    ఈ పాత్ర కోసం ఆయన గుండు గీయించుకున్నారు. గతంలో ఆయన గుండు గీయించుకుని చేసిన చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. . '100వదు నాల్‌'లో విలన్ గా తనదైన నటన ప్రదర్శించి కోలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జల్లికట్టు', 'అమైదిపడై', 'మారన్‌'వంటి పలు సినిమాలు చేశారు. వీటి కోసం ఆయన గుండు గీయించుకుని నటించడం విశేషం.

    త్వరలో ప్రారంభం కాబోతున్న ఈచిత్రం ప్రస్తుతం కథా చర్చల దశలో ఉంది. ఇటీవల రాజమౌళి స్టోరీ డిస్కర్సన్లో ప్రభాస్, అనుష్క, రాణా తదితరుల కలిసి పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ వీక్షించవచ్చు.

    ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'బహుబలి' చిత్రంలో అనుష్క హీరోయిన్‍‌గా, రాణా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా ఈగ ఫేం సుదీప్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.

    చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం, హార్స్ రైడింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి పని చేస్తున్నా ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

    English summary
    The director S S Rajamouli has chosen the actor Satyaraj for his next film "Bahubali", played by the actor Prabhas and Anushka. According to rumors, Satyaraj will be called "Kabba" and he will may be the big villain of the film "BahuBali".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X