అలా చేసే బదులు హగ్గులు, ముద్దులిస్తాను.. పాయల్ రాజ్‌పుత్‌పై బాయ్ ఫ్రెండ్ కామెంట్స్
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. పాయల్‌ను ఫాలో అయ్యే ఫ్యాన్స్‌కు ఆమె బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా గురించి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడూ కూడా పాయల్ పక్కనే ఉంటాడు. పాయల్‌తో కలిసే ఉంటాడు. ఇక పాయల్ తనను ఎలా విసిగిస్తుందో.. తనను అతడు ఎంత ప్రేమిస్తాడు.. ఎంత భరిస్తాడన్న వాటి గురించి ఇద్దరూ చెప్పుకుంటూ ఉంటారు. నేడు పాయల్ బర్త్ డే సందర్భంగా సౌరభ్ చెప్పిన విషెస్ వైరల్అవుతున్నాయి.

అతని బర్త్ డేకు అలా..
సౌరభ్ బర్త్ డేకు పాయల్ అప్పట్లో చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. గతేడాది పాయల్ చేసిన పోస్ట్‌తో ఈ ఇద్దరి వ్యవహారం బయటకు వచ్చింది. ‘నా తప్పొప్పులను ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకంటే మిన్నైనా వారు ప్రపంచంలో ఇంకెవరూ లేరు..మనం కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంతో భద్రంగా గుండెల్లో దాచుకుంటాను.. నా జీవితంలోని నువ్వు తీసుకొచ్చిన సంతోషం, ప్రశాంతతకు నేనెప్పుడు కృతజ్ఞారాలినే. హ్యాపీ బర్త్ డే మేరీ జాన్' అంటూ పాయల్ పోస్ట్ చేసింది.

నేడు పాయల్ బర్త్ డే..
ఇక నేడు (డిసెంబర్ 5) పాయల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యాన్స్, సెలెబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో పాయల్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ అందరిలోనూ పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరభ్ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

హగ్గులు, కిస్సులు..
ఈ భూమ్మీద నేనే అదృష్ట వంతుడిని.. ఎందుకంటే నువ్ నా పక్కన ఉన్నావ్ కాబట్టి. ఈ విషయాన్ని ఆకాశంపై రాయాలని ఉంది.. అప్పుడు అందరికీ కనిపిస్తుంది కదా.. కానీ దానికి బదులు నీకు ముద్దులు, హగ్గులు ఇస్తాను.. దాని ద్వారా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. హ్యాపీ బర్త్ డే మై ఏంజిల్.. అంటూ పాయల్‌పై సౌరభ్ ప్రేమను కురిపించాడు.

పాయల్ ఫుల్ బిజీగా..
పాయల్ రాజ్ పుత్ ఇటీవలె అనగనగా ఓ అతిథి సినిమాతో అదరగొట్టేసింది. అద్భుతమైన నటనను కనబర్చి మంచి మార్కులుకొట్టేసింది. ఇవేగాక పలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లు కూడా పాయల్ చేతిలో ఉన్నాయి. అన్నీ తెలుగు ప్రాజెక్ట్‌లే అవ్వడంతో పాయల్ హైద్రాబాద్‌కే మకాం మార్చేసింది.


Click it and Unblock the Notifications











