twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి రచ్చ: జెమినీ గణేశన్ కూతురికి సావిత్రి కూతురు కౌంటర్, బంధువులే రాబంధులయ్యారు...

    By Bojja Kumar
    |

    Recommended Video

    Savitri Daughter Replies To Kamala Ganeshan

    సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీ సూపర్ హిట్ టాక్‌తో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అందరికీ నచ్చేలా ఒక గొప్ప సినిమా తీశామనే సంతృప్తిలో యూనిట్ సభ్యులు, అమ్మ గురించి అసలు నిజాలు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా తెలిశాయనే సంతోషంలో సావిత్రి పిల్లలు ఉండగా....... జెమినీ గణేశన్ మొదటి భార్య పిల్లలు 'మహానటి'పై అంసతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. ఇందులో మా నాన్నను చాలా తక్కువ చేసి చూపించారని, నాన్న గురించి ఇందులో చూపింది అంతా అబద్దమే అని, దీన్ని మేము యాక్సెప్ట్ చేయబోమని ప్రకటన చేయడం విదానికి దారి తీసింది. ఈ వివాదంపై సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు.

    ఆమె సినిమాను సరిగా అర్థం చేసుకోలేదేమో?

    ఆమె సినిమాను సరిగా అర్థం చేసుకోలేదేమో?

    మా అక్క కమలా సెల్వరాజ్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఆమె వాదనను నేను ఖండించదలుచుకోలేదు. సినిమా నాకు నచ్చింది. నేను ఒక కోణం నుండి సినిమా చూశాను, ఆవిడ మరో కోణం నుండి సినిమా చూసి ఉండొచ్చు. మా అక్కకి అమ్మంటే(సావిత్రి) చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయం చెప్పారు. అమ్మ మీద చాలా మర్యాద ఉంది. అయితే నాన్నను సరిపోయినంత చూపించలేదు అని ఆమె భావించారేమో? ఒక సినిమా చూసినపుడు ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.... అని విజయ చాముండేశ్వరి వ్యాఖ్యానించారు.

    నాకు నెగిటివిటీ కనిపించలేదు

    నాకు నెగిటివిటీ కనిపించలేదు

    సినిమా విడుదల ముందు ఇందులో నాన్నను నెగెటివ్ గా చూపిస్తారేమో అనే భయం మాకు కూడా ఉండేది. ఎందుకంటే నాన్నది అంత నెగెటివ్ క్యారెక్టర్ కాదు. అందుకే నేను ముందు నుండి సినిమా యూనిట్‌తో టచ్ లో ఉన్నాను. వాళ్లు తీసే విధానం, స్క్రిప్టు మొదటి నుండి చూస్తున్నాను. అందులో నాకు నెగెటివిటీ ఏమీ కనిపించలేదు. అక్క ఒక్కసారిగా అలా చూసే సరికి ఆమెకు అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. నాకయితే అలా అనిపించలేదు. సినిమాలో నాన్నను డి గ్రేడ్ చేసి చూపించారనే ఆరోపణలో కూడా నిజం లేదు. పలానా సీన్ పటిక్యులర్‌గా ఏమైనా ఉందని చెబితే నేను దాని గురించి మాట్లాడతాను.... అని విజయ చాముండేశ్వరి అన్నారు.

     అమ్మకు అలా మద్యం అలవాటయింది

    అమ్మకు అలా మద్యం అలవాటయింది

    సావిత్రికి మద్యం అలవాటు జెమినీ గణేశన్ చేసినట్లు తప్పుగా చూపించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై సావిత్రి కూతురు స్పందించారు. అమ్మ పెరిగిన వాతావరణం చాలా స్ట్రిక్ట్. చౌదరి తాతయ్య ఎప్పుడైనా ఇంట్లో డ్రింక్స్ తీసుంటే అమ్మ గ్లాస్ వాసన చూసి అబ్బా ఇది ఎలా తీసుకుంటారు అని అరిచేదట. తర్వాత అమ్మకు మద్యం అలవాటయినపుడు తాతయ్య దాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి అమ్మాయి ఇలా అయిందేంటి అని బాధపడేవారు. నాన్న అమ్మను కూర్చోబెట్టి ఇదిగో తాగు అని నేర్పించలేదు. సినిమాలో కూడా అలా చూపించలేదు అని అన్నారు. సినిమా ఫీల్డులో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పార్టీలకు అటెండ్ కావడం, సోషల్ డ్రింకింగ్ చేయడం నార్మల్‌గా జరిగేదే. అమ్మకు కూడా సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉండేది.... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

     మరి సినిమాలో ఆ సీన్ ఎందుకు? అలా? అంటే...

    మరి సినిమాలో ఆ సీన్ ఎందుకు? అలా? అంటే...

    సినిమాలో ఓ సీన్ ఉంది. నాన్న తాగి కూర్చున్నపుడు ఎందుకిలా తాగుతున్నారు అని అమ్మ బాధ పడుతుంది. ఆ సిచ్యువేషన్లో నా బాధను పంచుకో అని నాన్న మందు గ్లాసు ఇచ్చినపుడు... అది సోషల్ డ్రికింగ్ కాదు కాబట్టి తాగను అని చెబుతుంది. అపుడు నాన్న నువ్వు పెద్ద మహానటివి అయిపోయావా? ఈ చిన్న యాక్టర్‌తో తాగవా? అన్నట్లు ఒక సీన్ ఉంది. తనేమో తాగే మూడ్లో లేదు. ఈ మాట అనేసరికి అమ్మ గబుక్కున తాగేసి గ్లాస్ కింద పెట్టేస్తుంది. వెంటనే నాన్న కంగారుపడిపోయి మెల్లిగా తాగు అని చెబుతాడు. అందులో నాన్న ఎక్స్ ప్రెషన్స్ చాలా బావుటుంది. దుల్కర్ ఆ పాత్రలో చాలా బాగా చేశారు. సినిమాలో నాన్నే మందు అలవాటు చేసినట్లు ఎక్కడా చూపించలేదు... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

     నాన్నపైకి కుక్కులు వదిలి, పనివాళ్లతో గెంటించిన మాట నిజమే

    నాన్నపైకి కుక్కులు వదిలి, పనివాళ్లతో గెంటించిన మాట నిజమే

    కమలా గణేశన్ చెప్పినట్లు అమ్మ కష్టాల్లో ఉన్నపుడు నాన్న చాలా సార్లు సాయం చేయడానికి వచ్చారు. నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం. చాలా సార్లు అమ్మను ప్రొటెక్ట్ చేయాలని గోడ దూకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాన్న ఉన్నపుడు ఇంట్లో ఫైనాన్స్ వ్యవహారాలు, ఇతర వ్యవహారాలు హద్దుల్లో ఉండేవి. నాన్నకు, అమ్మకు మధ్య దూరం పెరిగి ఆయన రాకుండా అయిపోయిన తర్వాత బంధువులంతా రాబందుల్లా వాలారు. అందరూ అమ్మ సెన్సిటివ్ సిచ్యువేషన్ ను ఉపయోగించుకుని నాన్న గురించి చెడుగా చెబుతూ అమ్మను చాలా అప్ సెట్ చేశారు. చివరకు నాన్న లోపలికి వస్తుంటే కూడా నీ మొహం చూడను పో అనే స్టేజీకి అమ్మ వచ్చేసింది. ఒకసారి నాన్న గోడదూకి అమ్మను చూడటానికి వచ్చారు. అమ్మ వద్ద ఉండే బంధువులు ఇంట్లో పని వారిని, వాచ్ మెన్‌ను పెట్టి తరిమేశారు. ఇది నేను కూడా చూశాను. అపుడు ఇంట్లో కుక్కలు కూడా ఉండేవి. అక్క చెప్పిన ఈ మాటలు నిజమే అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

     మా మధ్య మంచి రిలేషన్ ఉంది

    మా మధ్య మంచి రిలేషన్ ఉంది

    మా అక్కాచెల్లెళ్ల మధ్య ఇపుడు మంచి రిలేషన్ ఉంది. జరిగింది ఏదో జరిగింది... మనం అంతా దాన్ని మరిచిపోయి కలిసి ఉందాం అనే సిచ్యువేషన్లో ఉన్నాము. జరిగిన విషయాల గురించి అందరం కూర్చుని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ మూవీ వల్ల మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ చెడదు. అక్క నన్ను తిట్టనివ్వండి, ఏమైనా అననివ్వండి, ఆవిడతో ఉన్న రిలేషన్ ఎప్పటికీ చెడగొట్టుకోను. నాకు నాన్న దగ్గర నుండి వచ్చిన చాలా విలువైన ఆస్తి మా అక్క చెల్లెళ్లు. ఈ మూవీ వల్ల మా రిలేషన్ ఏ మాత్రం చెడిపోదు.... అని విజయ చాముండేశ్వరి అన్నారు.

     అందుకే వారిని సంప్రదించలేదు

    అందుకే వారిని సంప్రదించలేదు

    ‘మహానటి' సినిమా తీసే ముందు జెమినీ గణేశన్ కూతుళ్లను చిత్ర యూనిట్ సంప్రదించక పోవడానికి కారణం ... వారు మెయిన్‌గా అమ్మ మీదే సినిమా తీస్తున్నారు. అందుకే వారిని సంప్రదించలేదు. అయినా సినిమా పూర్తయిన తర్వాత కమలా సెల్వరాజ్‌ను స్వప్న వెళ్లి కలిసింది. అక్క కూడా చెప్పింది నాకు సావిత్రి అమ్మ అంటే చాలా ఇష్టం అని, నాకు మూవీ చూపించండి అని కూడా ఆమె కోరారు.... అని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు.

    అలివేలు పెద్దమ్మ చాలా మంచిది

    అలివేలు పెద్దమ్మ చాలా మంచిది

    నాన్న మొదటి భార్య, మా పెద్దమ్మ అలివేలు చాలా మంచిది. నాన్న అమ్మను పెళ్లి చేసుకున్నపుడు ఆమె మనస్తూర్తిగా స్వీకరించింది. మా అందరినీ ఎంతో బాగా చూసుకునే వారు. నా పెళ్లి కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. ఈ సీన్లన్నీ చిత్రీకరించారు కానీ 3 గంటలకు సినిమాను కుదించడంలో భాగంగా ఆ సీన్లను ఎడిట్ చేసి తీసేశారు అని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు.

    English summary
    Savitri daughter's Vijaya Chamundeswari counter to Gemini Ganesan’s daughter about Mahanati Controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X