twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్తి కోసం కేసులు: సావిత్రి కూతురు నిజస్వరూపం ఇదే....చౌదరి మనవరాలు సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mahanti Savitri Daughter Get Blamed By Her Sister

    ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం సూపర్ హిట్ అయింది. సినిమా విడుదల ముందు, విడుదల తర్వాత జరిగిన ప్రమోషన్లలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఎక్కువగా ఫోకస్ అయ్యారు. మీడియా వారు కూడా ఆమెను ఇంటర్వ్యూ చేయడానికే ఆసక్తి చూపడం, ఆయా ఇంటర్వ్యూలో ఆమె తన తల్లిని తలుచుకంటూ ఎమోషనల్ అవ్వడం, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టడం లాంటివి చూశాం. అయితే విజయ చాముండేశ్వరి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సావిత్రిని బాధించిన వారిలో ఈవిడ కూడా ఒకరు అంటూ కెవి చౌదరి మనవరాలు ఆరోపించారు.

    వైరల్ అవుతున్న చౌదరి మనవరాలు ఆడియో టేపు

    వైరల్ అవుతున్న చౌదరి మనవరాలు ఆడియో టేపు

    ‘మహానటి' విడుదలైనప్పటి నుండి విజయ చాముండేశ్వరి ప్రవర్తన, కామెంట్స్ చూస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అమ్మ మీద ప్రేమ చూపించడంలో తప్పు లేదు. పైగా సావిత్రి గ్రేట్ మదర్. కానీ సావిత్రి చివరి రోజుల్లో విజయ చాముండేశ్వరి ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.... అంటూ చౌదరి మనవరాలు విడుదల చేసిన ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    సావిత్రి ఇంటి కోసం కేసులు వేసి తరిమేశారు

    సావిత్రి ఇంటి కోసం కేసులు వేసి తరిమేశారు

    సావిత్రి బ్రతికి ఉన్నపుడు విజయ చాముండేశ్వరి, ఆమె హస్బెండ్, వాళ్ల బంధువులు..... సావిత్రి ఇంటి కోసం ఆమెపై కోర్టు కేసులు వేసి, ఇంటి నుండి తరిమేశారు. సావిత్రి అపుడు అన్నానగర్‌లో కొడుకు సతీష్‌తో అద్దింట్లో ఉన్నారు. విజయ, ఆమె భర్త, బంధువులు సావిత్రి సొంత ఇంట్లో ఉన్నారు. మీ అమ్మ బ్రతికి ఉన్నపుడు నువ్వు ఇదంతా చేసి ఇపుడు ప్రజల ముందు అమ్మ గురించి తలుచుకుంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నావు. ఇది చూసి కాస్త బాధేసింది.... అని కెవి చౌదరి మనవరాలు తెలిపారు.

    తన పేరు వెల్లడించని కెవి చౌదరికి మనవరాలు!

    తన పేరు వెల్లడించని కెవి చౌదరికి మనవరాలు!

    నాకు ఇదంతా ఎలా తెలుసు అంటే.....చౌదరి తాతయ్య అని విజయ చాముండేశ్వరి చెబుతున్న వ్యక్తి ఎవరో కాదు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి. మా అమ్మకి సొంత పెద్దనాన్న. దురదృష్ణవశాత్తు మాకు తాతయ్య. అలా చిన్నప్పటి నుండి సావిత్రి గురించి విషయాలు మాకు తెలిసేవి. కెవి చౌదరికి పిల్లలు లేరు, సావిత్రిని, ఆమె సిస్టర్‌ను పెంచుకున్నారని సినిమాలో చూపించారు. కానీ కెవి చౌదరి బెజవాడలో వైఫ్ ఉండేది, మా అమ్మమ్మ ఉండేది. ఒక బాబు ఉండేవాడు. ఆయన దుర్గాంబని పెళ్లి చేసుకున్నారో? చేసుకోలేదో? ఇపుడు అప్రస్తుతం. చౌదరి తన సొంత ఫ్యామిలీని అయితే సరిగా చూసుకోలేదు... అని చౌదరి మనవరాలు తెలిపారు.

    చౌదరి చాలా జల్సాలు చేశాడు

    చౌదరి చాలా జల్సాలు చేశాడు

    నాకు ఇప్పటికీ బాధేసే విషయం ఏమిటంటే... మా అమ్మకు 5 నెలలు ఉన్నపుడు మా అమ్మమ్మ చనిపోయారు. అపుడు చౌదరి తాతయ్యకు డబ్బులు కావాల్సి వచ్చింది. దీంతో ఆయన వాళ్ల తమ్ముడు ... అంటే మా రియల్ తాతయ్య దగ్గరకు డబ్బులు కావాలని వస్తే మా అమ్మమ్మ నగలు ఈయనకు ఇచ్చారు. వాటిని అమ్మి... విజయవాడలో 2 కార్లు కొని బిజినెస్ చేస్తానని చెప్పి ఏదేదో చేశారు. మా అమ్మ తల్లి లేని పిల్ల, తనను అలా చేయకూడదు అనే ఆలోచన కూడా తాతయ్యకు ఉండేది కాదు. అది కూడా కాకుండా తన పొలం, తన తమ్ముడి పొలం అన్నీ అమ్మేసి చౌదరి చేసిన జల్సాలకు అసలు లెక్కేలేదు.... అని ఆమె ఆడియోలో వెల్లడించారు.

    మీ అమ్మను నువ్వు చాలా బాధ పెట్టావ్...

    మీ అమ్మను నువ్వు చాలా బాధ పెట్టావ్...

    ఇపుడు చౌదరి గురించి ఎందుకు చెబుతున్నానంటే.... సావిత్రి ఎలా తాగారు? తాగడం ఎలా నేర్చుకున్నారు? అనే డిస్క్రర్షన్ సాగుతోంది. చౌదరి బాగా తాగేవారు, దుర్గాంబ కూడా బాగా తాగేవారు. సావిత్రి అలాంటి వాతావరణంలో పెరిగింది. ఎవరు తాగుడు నేర్పించారు అనేది ఇపుడు ముఖ్యం కాదు. సావిత్రి అలా తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటుంటే సొంత డాటర్ నువ్వు ఉన్నావు. నువ్వు అపుడు చిన్న పిల్లవేం కాదు. నువ్వేం చేశావు? ఆవిడను ఇంకా ఇంకా బాధ పెట్టావు. బయోపిక్ అంటే అన్ని నిజాలు చూపించాలి, అందుకే తాగుడు చూపించామని ఇంటర్వ్యూలో నువ్వు చెప్పడం విన్నాను. కానీ మిగతా నిజాలు కూడా ఎందుకు చూపించ లేదు? మీరు కోర్టు కేసు వేసి ఆవిడను ఇంకా ఇంకా హింసించారు.... ఆ విషయం ఎందుకు చూపించలేదు అని విజయ చాముండేశ్వరిని చౌదరి మనవరాలు ప్రశ్నించారు.

     సావిత్రి జీవితం సెలబ్రేషన్ కాదు, ట్రాజెడీ

    సావిత్రి జీవితం సెలబ్రేషన్ కాదు, ట్రాజెడీ

    మీ అమ్మకు చిన్నప్పటి నుండి కష్టాలే. వాళ్ల నాన్న పోవడం, ఎవరో పెంచుకోవడం, చిన్న వయసులో సినిమాల్లో చేర్పించడం.. ఇప్పటికీ కూడా మీరు సినిమా తీసి అమ్మ లైఫ్ ను సెలబ్రేషన్ లా చూపించాం, ట్రాజిడీగా చూపించడం మాకు ఇష్టం లేదు అని అంటున్నారు. నిజం ఏమిటంటే ఆమెది చాలా ట్రాజెడీ లైఫ్. ఆమెకు చెడు చేసిన చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఆమె సిస్టర్ కానీ, సిస్టర్ హస్బెండ్ కానీ... దే ఆర్ ఔటాఫ్ ది పిక్చర్. సొంత అమ్మను నువ్వు కోర్టుకు లాగి, ఇంటి నుండి బయటకు తరిమేశావు. తన కొడుకు సతీష్‌తో అన్నా నగర్‌లో అద్దె ఇంట్లో ఉండాల్సిన గతికి తెచ్చారు... అని చౌదరి మనవరాలు వెల్లడించారు.

     మీ అందరికీ కావాల్సింది డబ్బులే కదా

    మీ అందరికీ కావాల్సింది డబ్బులే కదా

    ఎవరు తాగుడు నేర్పించారు అనేది ముఖ్యం కాదు. అవిడ అలా అయిపోయేటపుడు ఒక కూతురుగా మీరు ఏం చేశారు? మీ అందరికీ కావాల్సింది డబ్బులే కదా. ఆవిడ చచ్చిపోయి మీకు డబ్బులు సంపాదించి పెట్టింది. ఇది చాలా హారబుల్. జెమినీ గణేశన్ ఫస్ట్ డాటర్ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. ఆమె చెప్పినట్లు ఇది బయోపిక్ కాదు.... కమర్షియల్ వెంచర్. డబ్బు కోసమే ఈ సినిమా చేశారు. అందరికీ ఆవిడ లైఫ్ గురించి తెలిసింది అని సంతోషంగా ఉంది. అదే సమయంలో కొన్ని విషయాలు మాత్రమే చూపించి మిగతాది దాచారనే బాధ మరో వైపు ఉంది... అని చౌదరి మనవరాలు ఆవేదన వ్యక్తం చేశారు.

     నువ్వు మంచి దానివే అయితే ఆ పని ఎందుకు చేయలేదు?

    నువ్వు మంచి దానివే అయితే ఆ పని ఎందుకు చేయలేదు?

    జెమినీ గణేశన్ పిల్లలతో చాలా క్లోజ్ రిలేషన్ ఉందని అంటున్నావు, ఈ సినిమాలో వాళ్ల ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నపుడు మీరు ఎందుకు వారి ఇన్‌పుట్స్ తీసుకోలేదు? అఫ్‌కోర్స్ బయోపిక్ మీ తల్లిదే,... మీరంతా జాయింట్‌గా ఉన్నారని చెప్పినపుడు వారి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు నిజంగా అంత మంచిదానివే అయితే మీ అమ్మ చనిపోయినపుడు తమ్ముడు సతీష్‌ను నువ్వు ఎందుకు తీసుకెళ్లి పెంచుకోలేదు. సతీష్‌ను ఎవరు పెంచారు? మీ తండ్రి జెమినీ పెంచారు. ఇక్కడ గొప్ప వ్యక్తి ఎవరు? అంటే జెమినీ గణేశన్ మొదటి భార్య. అన్నీ భరించింది, అందరినీ యాక్సెప్ట్ చేసింది.... అని చౌదరి మనవరాలు వెల్లడించారు.

    నువ్వు జనం ముందు, మీడియా ముందు ఏడవటం ఆపేయ్

    నువ్వు జనం ముందు, మీడియా ముందు ఏడవటం ఆపేయ్

    సావిత్ర కష్టాల్లో ఉన్నపుడు సొంత వాళ్లు చేయూత ఇవ్వలేదు. అలాంటి వారిలో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఒకరు. నువ్వు పబ్లిక్‌లో ఏడవొద్దు, మీడియా ముందు అమ్మ కోసం ఏడవద్దు. నువ్వు అలా ఏడుస్తుండటం అసలు నిజం తెలిసిన నాలాంటి వారంతా చాలా బాధ పడాల్సి వస్తోంది.... అని చౌదరి మనవరాలు తెలిపారు.

    English summary
    Mahanati Savitri Daughter Vijaya Chamundeswari Real Behaviour Revealed by Relative. Savitri was an Indian film actress, playback singer, dancer, director and producer. She appeared mainly in Telugu and Tamil language films but also in Kannada, Malayalam, and Hindi language films. Mahanati, The life story of South Indian actress Savitri, who took the film industry by storm in the late '50s and '60s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X